నేటి కాలంలో ఆడది కనిపిస్తే చాలు వయసుతో పని లేకుండా కొందరు మృగాళ్లా ప్రవర్తిస్తూ అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇలా ఎన్నో దారుణ ఘటనలు రోజుకొకటి పుట్టుకొస్తుండడంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు అడుగు పెట్టాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయి. అచ్చం ఇలాంటి దారుణ ఘటనలోనే ఓ 60 ఏళ్ల వృద్ధుడు కామంతో కళ్లు నెత్తికెక్కి మూడున్నరేళ్ల మనవరాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తాజాగా బీహార్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పోలీసులు తెలిపన కథనం ప్రకారం.. ఇటీవల హాజీపూర్ లో తన మేనకోడలి వివాహానికి హాజరయ్యాడు 60 ఏళ్ల వినోద్ భగత్. ఇక వివాహ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉన్నాడు. ఈ సమయంలోనే పెళ్లివేడుకలో వరసకు మనవరాలైన మూడున్నరేళ్ల బాలికపై ఈ దుర్మార్గుడు కన్నేశాడు. ఇక విషపూరిత ఆలోచనలు మెదడులో నింపుకుని ఆ బాలికపై అత్యాచారం చేసేందుకు ఆ దిశగా అడుగులు వేశాడు.
ఈ క్రైమ్ వార్తలు చదివారా?దీంతో మెల్ల మెల్లగా ఆ బాలికకు ఏదో ఆశ చూపి మెడపైకి వెళ్దామంటూ అక్కడికి తీసుకెళ్లి మనవరాలు అని చూడకుండా ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు ఒక్కసారిగా మేడపైకి వెళ్లారు. అక్కడ జరిగిన ఈ సీన్ చూసి బంధువులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కోపంతో రగిలిపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు వినోద్ భగత్ పై దాడికి దిగారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మూడున్నరేళ్ల చిన్నారి అని చూడకుండా 60 ఏళ్ల వృద్ధుడు చేసిన ఇంతటి దారుణంపై మీ మీరైతే ఎలాంటి శిక్ష విధిస్తారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.