ఎంతో సాఫీగా సాగాల్సిన భార్యాభర్తల జీవితాలు క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. భార్యలపై అనుమానాలు పెంచుకున్న కొందరు భర్తలు ఆగ్రహంతో ఊగిపోయి అంతమొందించేందుకు కూడా వెనకాడని పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఇలాంటి దారుణానికే పాల్పడ్డ బీహార్ లోని ఓ భర్త అందమైన భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక విషయం ఏంటంటే..? రోహ్తాస్ జిల్లా పరిధిలోని కోచాస్ తాలూకాలో సోనూ కుమారి అనే మహిళ, గొల్లు షా అనే వీరిద్దరూ భార్యాభర్తలు. 2017లో వీరికి వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. తుక్కు వ్యాపారం చేస్తూ ఇద్దరూ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే భర్త తీరులో కాస్త మార్పు వచ్చింది. తాగి రావడం, భార్యపై అనుమానం పెంచుకుని తిట్టడం, కొట్టడం చేస్తూ ఉండేవాడు. కొంత కాలం అలాగే గడుస్తూ చివరికి వీరిద్దరి మధ్య వివాదం చినిగి చినిగి గాలి వానలా తయారైంది.
కొన్నాళ్లకి గొడవపై పెద్దల సమక్షంలో అనేక సార్లు చెప్పినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. అలా ఓ రోజు మళ్లీ భార్యపై భర్త వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో భార్య కూడా తెగేసి మాట్లాడడంతో భర్త గొల్లు షా ఆగ్రహంతో ఊగిపోయాడు. పిల్లల ముందే భర్త దారుణానికి పాల్పడుతూ.. భార్య సోనూ కుమారిని గొంతు పిసికి దారుణంగా హత్యచేసి పరారయ్యాడు. ఇక విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఎట్టకేలకు పోలీసులు గాలింపు చర్యల్లో నిందితుడు భర్త గొల్లు షా ఖాకీల చేతికి చిక్కాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు గొల్లు షాను కటకటాల్లోకి నెట్టేశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంవమవుతోంది.