అతనో గౌరవ ఉపాధ్యాయ స్థానంలో ఉన్న వ్యక్తి. పిల్లలను శారీరకంగా ధృడంగా ఉంచాల్సిన ఫిజికల్ ట్రైనర్ గా పని చేస్తున్నాడు. కానీ, ఈ పంతులు శారీరక దారుఢ్యం గురించి మర్చిపోయి.. శారీరక సుఖాలు తీర్చాలంటూ విద్యార్థినిని వేధిస్తున్నాడు. కోరిక తీర్చాలంటూ పదో తరగతి విద్యార్థినిని వేధించడం మొదలు పెట్టాడు. ‘నా భార్యకు ఆరోగ్యం బాలేదు.. నా కోరిక తీర్చావంటే నీకు కావాల్సినవన్నీ చూసుకుంటా’ అంటూ నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వేధిస్తున్నాడు. ఇంట్లో ఉన్న ఫోన్ కు కాల్ చేయడం.. వాట్సాప్ సందేశాలు పంపడాన్ని తల్లిదండ్రులు గమనించారు. అక్కడితో అతని బండారం మొత్తం బయట పడింది.
ఇదీ చదవండి: భార్య గొంతు నులిమి, పసికందు ముక్కు మూసి! వేడుకున్నా వదల్లేదు!
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘనకార్యం చేసింది అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం శ్రీధరఘట్టలోని జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు. రెండు రోజుల క్రితం పదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఉండే సెల్ ఫోన్ కు వ్యాయామ ఉపాధ్యాయుడు కాల్ చేశాడు. విద్యార్థినితో అతడు మాట్లాడే తీరుపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే ఫోన్ పరిశీలించారు. వాట్సాప్ లో అతను పంపిన ఆడియో మెసేజ్ లు కూడా ఉన్నాయి. అందులో అతను ఎంతమాత్రం సిగ్గు లేకుండా శిష్యురాలనే ఇంకితం లేకుండా మాట్లాడాడు. తన భార్యకు సంవత్సరం కాలంగా ఆరోగ్యం బాలేదని.. పాఠశాలలోని తన గదిలోకి తాను ఒంటరిగా వచ్చి.. అతని కోరిక తీర్చాలంటూ కోరాడు. అలా చేస్తే ఆమెకు ఏం కావాలన్నా ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు.
ఈ మాటలు విన్న తల్లిదండ్రులకు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే పాఠశాలకు వెళ్లారు. ఈ సంగతి ముందే తెలుసుకున్న ఆ సదరు ఉపాధ్యాయుడు ఎమర్జెన్సీ లీవ్ అప్లై చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. అతను చేసిన పాడు పని గురించి విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం విద్యార్థి సంఘం నాయకులకు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.