The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిగ్‌గా మారింది. కశ్మీర్ పండిట్లపై జరిగిన దారుణాన్ని కళ్లకు కట్టిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా హవాను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు సైబర్ నేరగాళ్లు. స్మార్ట్ ఫోన్ల యూజర్లే టార్గెట్‌గా రంగంలోకి దిగారు. వాట్సాప్ వేదికగా యూజర్లను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు సంబంధించి వాట్సాప్‌లో ఎటువంటి లింక్ వచ్చినా జాగ్రత్తగా ఉండాలని, వాటిని క్లిక్ చేయవద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రైం ఎలా జరుగుతుందన్న దాన్ని వివరించారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ఓ మెసేజ్‌ను పంపుతారు. ఆ మెసేజ్‌లో ‘‘ ది కశ్మీర్ ఫైల్స్’’ సినిమా ఫ్రీగా డౌన్‌లౌడ్ చేసుకోండి అని ఉంటుంది. దాని కింద ఓ లింకు కూడా ఉంటుంది. సినిమా మీద ఆసక్తితో మనం ఆ లింక్‌ను క్లిక్ చేయగానే వాళ్లకు సంబంధించిన సైట్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెంటనే మన ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు. ఓ మాల్‌వేర్‌ను ఫోన్‌లోకి పంపుతారు. ఆ మాల్‌వేర్ మన ఫోన్‌లోని సమాచారాన్ని దొంగిలించి వారికి పంపుతుంది.
ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వాటిని. దీంతో వారు ఖాతాల్లోని డబ్బులు హాంఫట్ చేసేస్తారు. వాట్సాప్‌లో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ మూవీ లింక్ క్లిక్ చేసి ఓ వ్యక్తి మోసపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుందని కూడా పోలీసులు తెలిపారు. అంతేకాదు! వాట్సాప్‌లో వచ్చిన లింకులు క్లిక్ చేయటం ద్వారా ఓ ముగ్గురు వ్యక్తులు 30 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఒకే రోజు పోలీసులను ఆశ్రయించారని వెల్లడించారు. వాట్సాప్‌లో వచ్చే లింకును క్లిక్ చేయకుండా ఉండటమే మంచిదన్నారు. సైబర్ నేరగాళ్లు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను వాడుకుని మోసాలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : OTTలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.