అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలోకి విసిరేశాడు. దీంతో ఆ మహిళ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అరిచింది. అయినా వినకుండా ఆ మహిళను సముద్రంలోకి విసిరేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే తన భార్యను సమద్రంలోకి విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఆ వ్యక్తి ఎందుకు తన భార్యను సమద్రంలోకి విసిరేశాడు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం. ఇండోనేషియాలోని ఓ ప్రాంతంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే ఈ దంపతులు ఇద్దరూ ఇటీవల సుండా స్ట్రెయిట్ గుండా ఫెర్రీలో ఓ పెద్ద పడవలో ప్రయాణించారు.
ఇదిలా ఉంటే వీరి ప్రయాణంలో భాగంగా.. అతని భార్య కూర్చుని బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంది. దీనిని గమనించిన ఆమె భర్త.. వెంటనే తన భార్యను చేతులతో ఎత్తుకున్నాడు. దీంతో ఖంగారు పడ్డ భార్య.. హెల్ప్ మీ హెల్ప్ మీ అని అరిచింది. అయినా వినకుండా ఆమె భర్త.. భార్యను సముద్రంలో విసిరేశాడు. అయితే ప్రమాదవాశాత్తు ఆమె నీటిలో పడకుండా ఆ పడవకున్న కడ్డీలను పట్టుకుంది. ఇదంతా గమనించిన పడవలో ఉన్న కొందరు వ్యక్తులు ఆ మహిళను రక్షించారు.
ఇక కోపంతో ఊగిపోయిన కాపడాడిన వ్యక్తులు ఆ మహిళ భర్తను చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి మతిస్థీమితం సరిగ్గా లేని కారణంగానే ఇలా చేసినట్లుగా తెలుస్తుంది. ఇదంతా గమనించిన పడవలో ఉన్న మరి కొందరు వ్యక్తులు ఆ మహిళను కాపాడాల్సింది పోయి తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు.
— Hardin (@hardintessa143) March 10, 2023