పెళ్లి రోజు వచ్చిదంటే.. అంతా ఇంతా హడావుడి కాదు. సన్నాయి మేళాలు, బారాత్, డీజె మేళాలు, చిన్న, పెద్ద అని తేడా లేకుండా డ్యాన్సుల జోరు ఉంటుంది. అలాగే ఓ పెళ్లి సందడి నెలకొంది..పెళ్లి కొడుకుకు సాంప్రదాయం ప్రకారం మండపానికి స్వాగతం పలికారు. అంతలో మహిళా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
సాధారణంగా పెళ్లి కుదిరిన దగ్గరి నుండే ఇంట్లో సందడి మొదలవుతుంది. వధూవరుల కుటుంబాల్లో చుట్టాల, బంధువుల రాకతో కోలాహలం నెలకొంటుంది. ఇక పెళ్లి రోజు వచ్చిదంటే.. అంతా ఇంతా హడావుడి కాదు. సన్నాయి మేళాలు, బారాత్, డీజె మేళాలు, చిన్న, పెద్ద అని తేడా లేకుండా డ్యాన్సుల జోరు ఉంటుంది. అలాగే ఓ పెళ్లి సందడి నెలకొంది..పెళ్లి కొడుకుకు సాంప్రదాయం ప్రకారం మండపానికి స్వాగతం పలికారు. వరుడు మండపంలోకి చేరుకున్నాడు. ఇంకాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. దాని కోసం కాస్త సేద తీరాడు. అప్పటివరకు సందడిగా ఉన్న మండపంలో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యే సీన్ మొదలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లిలో డాన్స్‌లతో ధూమ్ ధామ్‌గా కొనసాగిన ఊరేగింపు.. మండపానికి చేరుకుంది. ఊరేగింపుగా వచ్చిన వరుడు పెళ్లి మండపం చేరుకున్నాడు. ఇంతలోనే లేడీ పోలీసులు వచ్చి వరుడిని అరెస్ట్ చేశారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అతనిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. ఒడిశాలోని బార్ గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అజిత్ కుమార్ భోయ్ ఒడిశాలోని ఢెంకానాల్‌కు చెందిన వ్యక్తి. ఒడిశా ఆర్టీసీ జేఈఈగా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఓ యువతితో వివాహం కుదిరింది. మంగళవారం రాత్రి పెద్దలు పెళ్లికి ముహూర్తాన్ని కుదిర్చారు. కాగా, అతగాడు గత రెండేళ్లుగా భువనేశ్వర్‌కు చెందిన మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు.
ఇప్పుడు ఆ మాట తప్పి.. మరో యువతితో మూడు ముళ్లకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన యువతి.. ప్రియుడిపై భువనేశ్వర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. పెళ్లి మండపానికి వెళ్లి అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వధువు కుటుంబ సభ్యులు అవాక్కు అయ్యారు. పెళ్లి పీటలు ఎక్కడానికి ముందే ఈ తంతు ముగియండంతో వధువు కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పెళ్లికి పెట్టిన బంగారం గొలుసు, ఉంగరం, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వధువు కుటుంబ సభ్యులకు అప్పగించారు.