ఎమ్మా డెలనే హాన్‌కాక్ ఎంతో అందమైన మహిళ. ఆమె వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే. ఆమె శృంగారానికి బానిసై తప్పుదోవ పట్టింది. తన కుటుంబానికి చెరగని చెడ్డ పేరు తెచ్చింది.
తల్లీ, తండ్రీ, గురువు, దైవం అంటారు. మనల్ని కన్న తల్లిదండ్రుల తర్వాత.. దేవుడికంటే ఎక్కువ గౌరవం గురువులకు ఉంటుంది. తల్లిదండ్రులు జన్మను ఇస్తే.. ఆ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలన్న జ్ఞానాన్ని గురువులు ఇస్తారు. జీవితాంతం మన కాళ్ల మనం నిలడే ధైర్యాన్ని ఇచ్చే ఎంతో విలువైన విద్యను మనకు అందిస్తారు. అంతేకాదు! విద్యతో పాటు సమాజంలో ఎలా మెలగాలి.. మంచి ఏది చెడు ఏది అని నేర్పిస్తారు. అయితే, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొంతమంది గురువులే తమ తప్పుడు ఆలోచనలతో.. తప్పుడు ప్రవర్తనతో పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇందులో మగ గురువు, ఆడ గురువు అన్న తేడా లేకుండాపోయింది. కొందరు తమ శారీరక సుఖం కోసం పిల్లలను బలి పశువులను చేస్తున్నారు. ఇందుకు అమెరికాలో వెలుగుచూసిన ఐదుగురు లేడీ టీచర్ల ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.
అమెరికాలోని కెంటకీకి చెందిన 38 ఏళ్ల ఎలెన్ షెల్, 32 ఏళ్ల హీథర్ హరే, 26 ఏళ్ల డెలనే హాన్‌కాక్, 36 ఏళ్ల క్రిస్టెన్ గాంట్, 33 ఏళ్ల అల్లీహ్ ఖేరద్‌మాండ్ తాము చదువు చెప్పే బడిలోని బాలురతో తప్పుగా ప్రవర్తించారు. తమ శారీరక సుఖం కోసం వారిని వాడుకున్నారు. చివరకు పాపం పండి జైలు పాలయ్యారు. జైలు పాలైన టీచర్లలో ఒకరైన డెలనే హాన్‌కాక్‌కు సంబంధించిన విషయాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆమె నేపథ్యం గురించి తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత అందంగా ఉండి.. అంత పెద్ద కుటుంబ నేపథ్యం ఉండి ఇలా ఎలా చేశావంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మా డెలనే హాన్‌కాక్ ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు. ఆమె ఓక్లహామా మేయర్ కూతురు. డెలనే భర్త నగరానికి చెందిన ఓ ఉన్నత పోలీస్ అధికారి. ఇక, డెలనేది అందరి దృష్టిని ఇట్టే ఆకర్షించే అందం. అందంతో పాటు ఉన్నత చదువు కలిగిన ఆమె శృంగారానికి బానిస అయింది. తాను చదువు చెప్పే వెల్‌స్టన్ పబ్లిక్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ 15 ఏళ్ల బాలుడితో సంబంధం పెట్టుకుంది. మొదట స్కూల్ అసైన్‌మెంట్ కోసం వీరి మధ్య చాటింగ్ మొదలైంది. న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపించుకునే వారు. తరచుగా శృంగారం గురించే మాట్లాడుకునే వారు. తర్వాతి కాలంలో అది శారీరక బంధానికి దారి తీసింది. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ కలుస్తూ ఉండేవారు.
డెలనే, ఆ బాలుడు స్కూలు లేనపుడు శృంగారం గురించిన చాటింగ్‌లు, వీడియో కాల్స్ చేసుకునేవారు. క్లాసులో ఎవరూ లేనపుడు కూడా హద్దులు దాటి ప్రవర్తించేవారు. క్లాస్‌లోనే ముద్దులు పెట్టుకునే వారు. కొంత కాలంపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిన వీరి సంబంధం బాలుడు చేసిన పొరపాటుతో వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడు టీచర్‌తో తనకున్న సంబంధాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అది నమ్మని ఆ స్నేహితుడు నేరుగా డెలనే దగ్గరకు వెళ్లి అడిగాడు. ఆమె అదంతా అబద్దం అని చెప్పింది. తర్వాత కొద్దిరోజులకు తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి బయటపెట్టింది. దీంతో ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అటు,ఇటు తిరిగి బాలుడి తల్లిదండ్రుల దృష్టికి వెళ్లటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెలనే అరెస్ట్ అయింది. మరి, విద్యార్థితో సంబంధం కారణంగా జైలు పాలైన డెలనే ఘటనపై మీ అభిప్రాయాలున కామెంట్ల రూపంలో తెలియజేయండి.