ఈ మధ్య కాలంలో హిజ్రాలు హద్దులు మీరుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేసిన ఘటనలు కూడా చాలా జరిగాయి. తాజాగా, కొంతమంది హిజ్రాలు ఓ యువకుడిపై దాడికి దిగారు. అతడి దగ్గరినుంచి ఫోన్ లాక్కున్నారు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఓ యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో కొంతమంది హిజ్రాలు అతడ్ని చుట్టుముట్టారు. అతడిపై విరుచుకుపడ్డారు. కాళ్లతో ఎగిరెగిరి తన్నారు. వారి దెబ్బలు తాళలేక యువకుడు అల్లాడిపోయాడు. అయినా ఎవరూ అతడ్ని రక్షించటానికి రాలేదు. చివరకు అతడి ఫోన్ కూడా లాక్కున్నారు.
కొద్ది సేపటి తర్వాత అతడే వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సీసీటీవీ కెమెరాల్లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడికి పాల్పడిన హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నేరాలకు పాల్పడుతున్న దాదాపు 10 మంది హిజ్రాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం యువకుడిపై హిజ్రాల దాడికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు హిజ్రాల ఆగడాలపై మండిపడుతున్నారు. వారి చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.