పైన ఫోటోలో కనిపిస్తున్న వీళ్లిద్దరి పేర్లు ప్రకాష్, దివ్య వీళ్లిద్దరూ గత మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇక పెళ్లి చేసుకోవాలని భావించి వీరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు చెప్పారు. ఇద్దరివి ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి పెళ్లికి ఇద్దరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే యువకుడు ప్రకాష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ప్రకాష్ తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. అయితే ప్రకాష్ రెండు కాళ్లు పోగొట్టుకోవడంతో వీరి పెళ్లి జరిగిందా? ఈ ప్రమాదం తర్వాత వీరి ప్రేమ అలాగే కొనసాగిందా లేదా అనేది తెలియాలంటే పూర్తి కథలోకి వెళ్లాల్సిందే.
అది తమిళనాడు తిరునెల్వెలి జిల్లా వల్లీయూర్ పరిధిలోని కేశవనేరి. ఇదే ప్రాంతంలో ప్రకాష్ అనే యువకుడు నివాసం ఉంటూ స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రకాష్ కు వీరి పక్క గ్రామానికి చెందని దీప అనే యువతి పరిచయం అయింది. వీరి పరిచయం రాను రాను చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు ఇష్టపడడంతో గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అలా ప్రేమ విహారంలో తేలియాడుతూ సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక ఎలాగైన పెళ్లి చేసుకోవాలిన భావించి ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించారు. ప్రకాష్, దీప ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు తొందర్లోనే ఒప్పుకున్నారు.
ఇక వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. అయితే ప్రకాష్ ఏదో పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ప్రాణాలు బయటపడ్డ.. ప్రకాష్ తన రెండు కాళ్లు మాత్రం పోగొట్టుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు, ప్రియురాలు దీప కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రకాష్ నడవలేని స్థితిలో ఉండి వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. అలా రెండు మూడు నెలలు గడిచింది. అయినా వీరిద్దరి ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదు. ఇంతకు మునుపు లాగే దీప ప్రకాష్ కు ఫోన్లు చేస్తూ మాట్లాడేది.
ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ప్రకాష్ రెండు కాళ్లు పోగొట్టుకోవడంతో దీప తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఈ సారి నిరాకరించారు. దీంతో దీప మాత్రం పెళ్లి చేసుకుంటే ప్రకాష్ నే చేసుకోవాలని బలంగా అనుకుంది. దీంతో గత వారం కిందట ప్రకాష్ కుటుంబ సభ్యుల సాయంతో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దీప తల్లిదండ్రులు ప్రకాష్ ఇంటికి చేరుకుని అతనిపై దాడి చేశారు. కాళ్లు లేని వాడికి మా కూతురితో ప్రేమా వివాహం కావాలా అంటూ దూషించి దీపను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో ప్రకాష్ తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.