ఇప్పటి వరకు పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న మగాళ్లను చూశాం. కానీ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని మగాళ్లను బురిడి కొట్టించిన మహిళలను ఎప్పుడైనా చూశారు. ఇదిగో ఇప్పుడు మీరు చదవబోయేది ఈ నిత్యపెళ్లి కూతురు గురించే. అసలు ఆ మహిళ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంది? అనంతరం ఎలాంటి మోసాలకు పాల్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏమి ఎరగనట్లు అమాయకపు చూపులతో పైన కనిపిస్తున్న మహిళ పేరు సంధ్య. తమిళనాడులో మధురైలో నివాసం ఉంటుంది. ఇలాంటి అమాయకపు చూపులతోనే ఎందరో మగాళ్లను తన వైపుకు తిప్పుకుని పెళ్లిళ్ల పేరుతో మోసానికి పాల్పడుతుంది.
ఈ అందాల సుందరి నిత్య పెళ్లి కూతురుగా రికార్డుల్లోకి ఎక్కాలనుకుందో ఏమో కానీ వరుసగా ఒకటి కాదు రెండు కాదు.., ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. మొదట పెళ్లి చేసున్నోడితో కొన్ని రోజులు సంసారం చేయడం, ఏదో కారణం చేత అతడి నుంచి జారుకుని బంగారం, నగలతో ఉడాయించడం. ఇదే ఆ మహిళ అసలు మోసం. ఇలా వరుసగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని చివరికి ఆరో పెళ్లి కూడా సిద్దమైంది. తీరా అతినితోనైన సరిగ్గా సంసారం ఎలగబెట్టిందా అంటే అదీ లేదు. ఇతనితో మూడు రోజులు సంసారం చేసి ఆ తర్వాత అతనికి బైబై చెప్పింది.
ఇదిలా ఉంటే సంధ్య ఇటీవల తమిళనాడుకు చెందిన ధన్ పాల్ అనే వ్యక్తిని ఏడో పెళ్లి చేసుకుని ముచ్చటగా ఏడడుగులు వేసింది. అసలు విషయం ఆరో మొగుడికి తెలియడంతో ఒక్కసారిగా ఖంగుతిని ఉలిక్కిపడ్డాడు. ఈ నిత్యపెళ్లి కూతురి లీలలు ఒక్కొక్కటిగా బట్టబయలవడంతో ఆరో మొగుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే తన భార్య సంధ్య నిత్య పెళ్లిళ్ల భాగోతాన్ని పటాపంచలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరో మొగుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఈ నిత్య పెళ్లి కూతురు సంధ్యను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ నిత్య పెళ్లికూతురి భాగోతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.