ఆమె పేరు అనిత. వయసు 26 ఏళ్లు. తల్లిదండ్రులు ఉన్నదాంట్లో కొద్దొ గొప్పొ కూతురుని చదివించారు. అనిత అలా చదువుకుంటున్న క్రమంలోనే ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. అయితే కూతురు సాగిస్తున్న ప్రేమ విషయం ఎట్టకేలకు అనిత తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఏదో ఒకటి చెప్పి తల్లిదండ్రులు చివరికి కూతురికి నచ్చజెప్పి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగితో పెళ్లి జరిపించారు. ఇక పెళ్లైన నెల రోజులకే ఆ నవ వధువు ఊహించని షాక్ ఇచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో అసలు నిజాలు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది తమిళనాడులోని తుత్తుకూడి ప్రాంతం. ఇక్కడే అంథోణి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇక్కడే నివాసం ఉంటున్న అనిత యువతి అంథోణితో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం రాను రాను చివరకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు ప్రేమ విహారంలో తేలియాడుతూ కాలాన్ని వెల్లదీశారు. అలా కొన్నాళ్ల తర్వాత కూతురు ప్రేమ విషయం అనిత తల్లిదండ్రులకు తెలిసింది. పైగా ప్రియుడి కులం వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు అతనితో పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలోనే అనిత తల్లిదండ్రులు తుత్తుకూడికి చెందిన కధివరన్ అనే సాప్ట్ వేర్ ఉద్యోగితో అనితకు 2018లో వివాహం జరిపించారు.
ఇక పెళ్లైన నాటి నుంచి అనిత కధివరన్ తో అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వచ్చింది. పెళ్లైన కొత్తలొ కదా అలాగే ఉంటుందని కధివరన్ అనుకుంటూ వచ్చాడు. అయితే పెళ్లైన నెల రోజుల తర్వాత అనిత భర్తతో కలిసి బీచ్ కు వెళ్లాలని ప్లాన్ వేసింది. ఇక భార్య బీచ్ కు వెళ్లాలని కోరడంతో భర్త కధిరన్ కాదనలేకపోయాడు. బీచ్ కు వెళ్లిన అనంతరం అనిత భర్తతో సంతోషంగా ఉంటున్నట్లు నటిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే అనిత ముందే తన ప్రియుడైన అంథణి సాయంతో భర్తను హత్య చేయాలని ప్లాన్ గీసింది. ఇందుకోసం వీరిద్దరి ప్లాన్ ప్రకారమే అంథణి బీచ్ కు వచ్చి అనిత భర్తను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇక ఏం తెలియనట్లుగా నటించిన అనిత అరుస్తు కేకలు వేసింది. దీంతో ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగేళ్ల పాటు దర్యాప్తు చేపట్టగా ఇటీవల అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక స్థానికంగా ఉండే సీసీ కెమెరాలను పరిశీలించగా కధివరన్ ను హత్య చేసింది భార్య అనిత, ఆమె ప్రియుడు అంథణి అంటూ పోలీసులు నిగ్గు తేల్చారు. అనంతరం ఈ దారుణ ఘటనపై స్పందించిన న్యాయస్థానం ఇటీవల ఆమె ప్రియుడు అంథణి, అనితకు యావజ్జీవ శిక్షవిధించాలంటూ తీర్పును వెలువరించింది. ఆలస్యంగా అసలు నిజాలు వెలుగులోకి రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు.