తమిళనాడులోని దిండుగల్ జిల్లా కొడైకెనాల్ నాయుడుపురం. ఇదే గ్రామానికి చెందిన ఎంకామ్ చదివే మోనీషా అనే అమ్మాయికి ఆరోగ్యస్వామి అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే కొన్నాళ్లు వీరిద్దరు మాట్లాడుకున్నారు. రోజులు గడిచే కొద్ది వీరి మధ్య బంధం బలపడి అది చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించి ఇద్దరు తల్లిదండ్రులను ఒప్పించి ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు.
అయితే పెళ్లైన కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది. కానీ భర్తకు మాత్రం భార్య ఉన్నత చదువులు చదివిందని కాస్త లోపల ఇగో ఉండేదట. దీనిని భర్త జీర్ణించుకోలేపోయాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా తలెత్తినట్లుగా తెలుస్తోంది. భర్త వేధించడంతో భార్య కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లింది. అక్కడే కొన్నాళ్లు ఉన్న భార్య తర్వాత భర్త వద్దకు చేరుకుంది. అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
ఇది కూడా చదవండి: Karnataka: వీళ్లు ప్రపంచాన్ని మరిచి ప్రేమించుకున్నారు.. కానీ పరువు కోసం పెద్దలు ఒకటే మాట చెప్పారు!
అయితే ఇటీవల పుట్టింటి నుంచి అత్తింటింటికి చేరుకున్న భార్యతో భర్త మరోసారి గొడవకు దిగాడు. కట్ చేస్తే మరుసటి రోజు భర్త భార్య పుట్టింటింటికి ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులు అత్తింటికి చేరుకుని కూతురు శవాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మోనీషా తల్లిదండ్రులు భర్తే మా కూతురిని హత్య చేసి ఏం తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేండి.