నువ్వు నచ్చావంటూ మాటలు కలిపాడు. ప్రేమిస్తున్నానంటూ ఒప్పుకునేదాక వెంటపడ్డాడు. అతని మాయమాటలు నమ్మిన ఆ యువతి అతని ప్రేమకు పచ్చ జెండా ఊపింది. కొంత కాలం తర్వాత ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రెండున్నరేళ్ల వరకు అతడు భార్యతో బుద్దిగానే సంసారం చేశాడు. ఇక అప్పుడు బయటపడింది మనోడి అసలు రూపం. అదనపు కట్నం కోసం భార్యను వేధించి చివరికి దారుణంగా పొడిచి చంపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం. ఇదే ప్రాంతానికి చెందిన మదన్, తమిళ్‌సెల్వి మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్ల వరకు వీరి కాపురం బాగానే సాగింది. కానీ ఆ తర్వాత బయటపడింది మనోడి అసలు క్యారెక్టర్. భార్యను అదనపు కట్నం తేవాలంటూ రోజూ వేధింపులకు గురి చేసేవాడు. భర్త పెట్టే టార్చర్ ను భార్య కొంత కాలం పాటు భరిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే జూన్ 25 నుంచి తమిళ్‌సెల్వి కనిపించకుండా పోయింది. దీంతో ఖంగారుపడ్డ ఆమె తల్లిదండ్రులు అటు ఇటు అంతా వెతికారు. ఎంతకు కూడా తమిళ్‌సెల్వి జాడ మాత్రం దొరకలేదు. ఇక ఆమె తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమిళ్‌సెల్వి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ భర్త మదన్ ఎక్కడా కూడా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతనిపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు మదన్ ను గట్టిగా విచారించేసరికి.., నేను, నా భార్య చిత్తూరు జిల్లా కైలాసకోనలోని కొండపైకి వెళ్లామని, అక్కడ మా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిపాడు.
ఇక కోపంతో కత్తితో నా భార్యను పొడిచి చంపానని భర్త మదన్ తెలిపాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కొండపై భార్య మృతదేహం అంతటా వెతికారు. కానీ తమిళ్‌సెల్వి మృతదేహం మాత్రం దొరకలేదు. అసలు ఆమె డెడ్ బాడీ ఏమైందో ఇప్పటి కూడా అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని కనిపెట్టేందుకు పోలీసులు అంతటా గాలిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపైమీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.