తంగరాజ్ అనే వ్యక్తికి గతంలో వివాహం అయింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతడు ఆర్మీ ఉద్యోగి కావడంతో ఇంటికి దూరంగా ఉండేవాడు. కానీ, తంగరాజ్ భార్య గతంలో మరణించింది. అలా కొన్నాళ్ల తర్వాత తంగరాజ్ కామంతో రగిలిపోయి పరాయి మహిళలతో పరిచయాలు పెంచుకునేవాడు. కట్ చేస్తే..!
మన దేశంలో రోజు రోజుకు ఊహించని దారుణాలు వెలుగు చేస్తున్నాయి. గోరుతో పోయే సమస్యలను గొడ్డలి దాక తెచ్చుకుని చివరికి రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడుకు చెందిన తంగరాజ్ అనే వ్యక్తికి ఓ కుమారుడు ఉన్నాడు. అతనికి గతంలో వివాహం అయింది. అయితే కుమారుడు ఆర్మీ ఉద్యోగి కావడంతో ఇంటికి దూరంగా ఉండేవాడు. గతంలో తంగరాజ్ భార్య మరణించింది. అలా కొన్నాళ్ల తర్వాత తంగరాజ్ కామంతో రగిలిపోయి పరాయి మహిళలతో పరిచయాలు పెంచుకునేవాడు. కట్ చేస్తే.. ఇటీవల ఇంట్లో కోడలు ఒంటరిగా ఉండడంతో మామ ఏం చేశాడో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు తిరునెల్వేలి పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే తంగరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తుండేవాడు. అయితే కొడుకు ఉద్యోగం రావడంతో ముత్తుమారి అనే మహిళతో వివాహం జరిపించాడు. ఇక అంతా సంతోషంగానే ఉందనుకున్న తరుణంలోనే తంగరాజ్ భార్య మరణించింది. కొడుకు తమిళరసన్ ఉద్యోగరిత్యా ఇంటికి దూరంగా ఉండేవాడు. దీంతో ఇంట్లో తంగరాజ్ ఒంటరిగా ఉండేవాడు. కోడలు మాత్రం కొన్ని రోజులు అత్తింట్లో, మరికొన్ని రోజులు పుట్టింట్లో ఉండేది. ఇదిలా ఉంటే చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా.. తంగరాజ్ స్థానికంగా ఉండే ఓ మహిళతో ప్రేమాయణాన్ని కొనసాగించాడు.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన ప్రియురాలిని ఇంటికి తెచ్చుకుని ఎంజాయ్ చేసేవాడు. ఇక రాను రాను ఆమెపై ఇష్టం పెరగడంతో తంగరాజ్ తన ప్రియురాలినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకోసం తనకు సపరేట్ గా ఇళ్లు కావాలని అనుకున్నాడు. మరో విషయం ఏంటంటే తన ఇళ్లును తంగరాజ్ గతంలో తన కొడుకుకి రాసిచ్చాడు. పెళ్లి చేసుకోవాలంటే ఓ ఇళ్లు కావాలనుకున్నాడు. ఇక ఉన్న ఇంట్లో కొంతబాగాన్ని తన పేరు మీద రాయాలంటూ తంగరాజ్ తన కుమారుడికి ఫోన్ చేసి అడిగాడు. దీనికి కుమారుడు తమిళరసన్ అంగీకరించలేదు. ఇదే విషయంపై కొడుకుతో తండ్రి తరుచు గొడవ పడేవాడు. అయితే సెలవుల్లో భాగంగా ఇటీవల కుమారుడు తమిళరసన్ ఇంటికి వచ్చాడు. కొడుకు ఇంటికి రాగానే తండ్రి తంగరాజ్ నా పేరు మీద ఇళ్లు రాయాలని కోరాడు.
ఇదే విషయమై ఇద్దరూ తండ్రీకొడుకులు గొడవ పడ్డారు. ఇక మధ్యలో కోడలు ముత్తుమారి వచ్చి.. భర్తకు మద్దతుగా నిలిచి మామకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఇదే మామ తంగరాజ్ కు కోపాన్ని తెప్పించింది. దీంతో మామ కోడలిపై పగ పెంచుకున్నాడు. అయితే ఈ నెల 7న రోజు కొడుకు తమిళరసన్ బయటకు వెళ్లాడు. ఇంట్లో కోడలు ముత్తుమారి ఒంటరిగా కనిపించింది. ఇదే మంచి సమయం అనుకున్న మామ.. కోడలిని దారుణంగా హత్య చేసి పరాయ్యాడు. ఇక కొద్దిసేపటి తర్వాత భర్త తమిళరసన్ ఇంటికి వచ్చి చూడగా.. భార్య ముత్తుమారి రక్తపు మడుగులో పడిపోయి కనిపించింది.
వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి.. అప్పటికే ఆమె మరణిచిందని తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మామ కనిపించకుండాపోవడం, ముత్తుమారి హత్యకు గురికావడంతో తంగరాజ్ పై, కొడుకు తమిళరసన్ కు, పోలీసులకు అనుమానం కలిగింది. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న తంగరాజ్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో నిందితుడు తంగరాజ్ నేరాన్ని అంగీకరించాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.