నేటి కాలంలో చాలా మంది యువత ఏమాత్రం కష్టపడకుండా.. లగ్జరీ లైఫ్ బతకాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైతే అడ్డదారులు తొక్కడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ఒకరు.. ఆడంబరాల కోసం ఏం చేసింది అంటే..
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. చాలా మంది రాత్రికి రాత్రే స్టార్స్‌గా మారారు. ఎందరో ప్రతిభావంతులు తెర మీదకు వచ్చారు. సామాన్యులు సైతం సెలబ్రిటీలకు ధీటుగా.. ఫాలోవర్స్‌ను సంపాదించుకుని.. దూసుకుపోతున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారి.. అభిమానులకు అవసరమైన సమాచారం అందిస్తూ.. తాము లక్షలు ఆర్జిస్తున్నారు. అయితే కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ మాత్రం.. పాపులారిటీ పెంచుకోవడం కోసం.. ఆడంబరమైన జీవితం గడుపుతున్నట్లు.. నెటిజనులకు చూపించడం కోసం.. అడ్డమైన పనులు చేస్తున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. ఓ ఇంట్లో దొంగతనం చేస్తూ.. పట్టుబడింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
తమిళనాడు, చెన్నైకి చెందిన అనిశ కుమారి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, రీల్స్ అప్లోడ్ చేస్తూ.. ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఈ రీల్స్‌లో అధిక భాగం ఆమె లగ్జరీ లైఫ్‌ను చూపించే విధంగా ఉంటాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె అసలు రంగు తాజాగా బయటపడింది. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమరాల్లో రికార్డవ్వడంతో.. ఈమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కొన్నిరోజుల కిత్రం అనిశ కుమారి.. పెరుంగళథూర్ ప్రాంతంలోని బుద్ధార్ నగర్ ఏరియాలో తాళం వేసి ఉన్న ఇంట్లో దూరి.. 3 బంగారు చైన్లు, 10 వేల క్యాష్ దొంగతనం చేసింది. ఆ తర్వాత స్కూటీ మీద అక్కడ నుంచి పరారయ్యింది. ఇంటికి చేరుకున్న బాధితులు.. ఇంట్లో బంగారం, నగదు పోయిందని గుర్తించారు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా.. ఆ ప్రాంతలో ఉన్న 30 సీసీకెమరాలను పరిశీలించారు. వీటిల్లో అనిశ కుమారి.. బాధితురాలి ఇంటి నుంచి నంబర్ ప్లేట్ లేని స్కూటీ మీద వెళ్లడం గుర్తించారు. తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పుకొచ్చింది.
రీల్స్‌లో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు చూపిస్తున్నానని.. దానికి తగ్గట్టుగా వీడియోలు తీయడం కోసం డబ్బు అవసరం పడటం వల్లే .. ఇలా తాళం వేసిన ఇంటికి కన్నం వేశానని చెప్పుకొచ్చింది. పైగా తన పేరు, ఫొటో రివీల్ చేయవద్దని.. అలా చేస్తే.. తాను సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాతులు నాశనమవుతాయని పోలీసులను కోరింది. అనిశ అరెస్ట్‌పై నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.