విశాఖ బీచ్ లో శ్వేత అనే గర్భణీ మహిళా నగ్నంగా అనుమానాస్పద రీతిలో మరిణించిన విషయం తెలిసింది. అయితే కూతురు మరణంపై శ్వేత తల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ నిజాలు బయటపెట్టింది.
విశాఖ బీచ్ ఒడ్డున 5 నెలల గర్భిణీ శ్వేత అనే మహిళా నగ్నంగా మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన ఆ మహిళ.. ఉన్నట్టుండి బీచ్ లో నగ్నంగా శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మృతురాలు 5 నెలల గర్భిణీ కావడం విశేషం. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు ముందే మృతురాలి అత్తమామలు మా కోడలు కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శ్వేత విశాఖ బీచ్ లో శవమై కనిపించింది. మరో విషయం ఏంటంటే? శ్వేత ఓ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో పెట్టిపోవడం విశేషం. పోలీసులు ఈ ఘటనను కాస్త సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
శ్వేత మృతిపై తల్లి చెప్పిన షాకింగ్ నిజాలు:
విశాఖ బీచ్ లో శవమై కనిపించిన శ్వేత తల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు ఆమె భర్తని ఎంతగానో ప్రేమించింది. పెళ్లైన రెండు నెలల నుంచి భర్తే సర్వస్వం అన్నంతంగా బతికింది. కానీ, మా అల్లుడు మణికంఠ మాత్రం.. ఎంత సేపు అమ్మానాన్న, అక్కా.. వారి పిల్లల గురించే ఆలోచించే వాడని, ఎన్నడు కూడా నా కూతురి గురించి ఆలోచించలేదు. నా భర్తే నాకు ముఖ్యం అంటూ నా కూతురు బతికింది. పెళ్లైన నాటి నుంచి భర్తను ఎంతో ప్రేమగా చూసుకుంది. నా కూతురికి చనిపోయే ముందు కనిపెంచిన తల్లి గుర్తుకు రాలేదని శ్వేత తల్లి కన్నీటి పర్యంతమైంది. నా భర్త చనిపోయినప్పటి నుంచి నా కూతురుని అపురూపంగా పెంచి పెద్ద చేశాను. కానీ, భర్త మాత్రం గర్భిణీ అని తెలిసి కూడా ప్రేమగా చూసుకోలేదు. ఏదైన గొడవ జరిగితే ప్రతీది నాకు చెప్పేది. అలా చెప్తుందని శ్వేత అత్త తెలుసుకుని ఇక నుంచి చెప్తే నీకు విడాకులు ఇస్తాననింటూ నా కూతురికి చెప్పేది. ఇక నాకు తోడుగా ఉంటుందనుకున్న ఒక్కగానొక్క కూతురు చివరికి ఈ లోకంలో నన్ను వదిలేసి వెళ్లిపోయిందంటూ ఆ తల్లి బోరున ఏడ్చింది. శ్వేత తల్లి చెప్పిన షాకింగ్ నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.