Crime News: అతడో స్వీపర్.. గర్ల్స్ హాస్టల్లో పని చేస్తున్నాడు. హాస్టల్లో ఉండే ఆడ పిల్లలతో ఎంతో మంచిగా ప్రవర్తించేవాడు. అక్కడ ఉండే అమ్మాయిలకు అతడు అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌లాగా అనిపించాడు. కానీ, ఓ రోజు అమ్మాయిల బాత్ రూముల దగ్గర అనుమానాస్పందంగా తచ్చాడుతూ కనిపించాడు. ఆ టైంలో అతడి చేతిలో ఫోన్ కూడా కనిపించింది. దీంతో అమ్మాయిలకు అనుమానం కలిగింది. అతడి ఫోన్ లాక్కుని చూడగా.. వాళ్ల దిమ్మదిరిగి పోయే దృశ్యాలు కనిపించాయి. దాదాపు అక్కడున్న చాలా మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఫోన్లో దర్శనమిచ్చాయి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌లోని రవాత్పూర్లో ఓ గర్ల్స్ హాస్టల్ ఉంది. చదువుకోసం ఆ ప్రాంతానికి వచ్చిన చాలా మంది అమ్మాయిలు ఆ హాస్టల్లో చేరారు. ఆ హాస్టల్లో రిషి అనే వ్యక్తి స్వీపర్‌గా పని చేస్తున్నాడు. రిషి హాస్టల్లో ఉండే అమ్మాయిలతో చాలా చక్కగా ప్రవర్తించే వాడు. అందరూ చెప్పినట్లు వింటూ ఎంతో మంచిగా ఉండేవాడు. అయితే, ఓ రోజు బాత్ రూము దగ్గర అతడు అనుమానాస్పందంగా తచ్చాడుతూ కనిపించాడు. ఆ టైంలో అతడి చేతిలో ఫోన్ కూడా ఉంది. అతడి ప్రవర్తనను గమనించిన కొందరు యువతులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడి ఫోన్‌ను లాక్కున్నారు.
అనంతరం ఫోన్ గ్యాలరీని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. అందులో హాస్టల్లోని చాలా మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నాయి. అప్పుడు వారికి విషయం అర్థం అయింది. రంధ్రం పడ్డం బాత్రూమ్ సందుల్లోంచి అమ్మాయిలు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తున్నాడని గుర్తించారు. తమతో ఎంతో అమాయకంగా ఉండే అతడు అలా చేస్తుండని తెలిసి తట్టుకోలేకపోయారు. అతడ్ని కోపంతో దాడి చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇక, హాస్టల్లోని యువతులందూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.