ఈమె పేరు మేఘన. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతుండగానే తండ్రి పెళ్లి చేశాడు. ఇక పెళ్లయ్యాక కూడా చదువుకుందాం అనుకుంది. కానీ, ఆమె భర్త ఒప్పుకోలేదు. దీంతో తిరిగి పుట్టింటికి వచ్చి పాలిటెక్నిక్ మూడేళ్లు పూర్తి చేసి ఇటీవల పరీక్షలు కూడా రాసింది. కట్ చేస్తే.. ఉన్నట్టుండి తండ్రికి మేఘన ఊహించని షాకిచ్చింది. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో చాలా మంది ప్రతీ చిన్న సమస్యకు కూడా భయపడిపోతున్నారు. వాటికి పరిష్కార మార్గమే లేదన్నట్లుగా భయపడి పోయి చేజేతులా నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇందులో చదువుకున్న వారు కూడా ఉన్నారు. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ యువతి అలా జరుగుతుందేమోనని భయపడి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఏం జరిగింది? ఆ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గార మండలం కొల్లి వలస గ్రామం. ఇదే గ్రామానికి చెందిన అప్పిలి రాంబాబుకు మేఘన అనే కూతురు ఉంది. ఆయితే ఆ అమ్మాయి పాలిటెక్నిక్ చదువుతున్న క్రమంలోనే తండ్రి ఎచ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో 2021లో వివాహం జరిపించాడు. పెళ్లాయ్యాక కూడా చదువుకుందాం అనుకుంది. కానీ, ఆమె భర్త అంగీకరించలేదు. దీంతో మేఘన తిరిగి పుట్టింటికి వచ్చింది. ఇక్కడే ఉంటూ పాలిటెక్నిక్ మూడేళ్లు పూర్తి చేసింది. ఇటీవల పరీక్షలు కూడా రాసింది. కానీ, మేఘన ఎగ్జామ్స్ బాగా రాయలేదని ఈ మధ్యకాలంలో తరుచు బాధపడుతూ ఉండేది. తల్లిదండ్రులు గమనించి ధైర్యం చెప్పి తమ బంధువుల ఇంటికి పంపించారు. అయితే రోజూ దానినే తలుచుకుంటూ మేఘన ఏడుస్తూ ఉండేది.
ఈ క్రమంలోనే.. నేను పరీక్షకు బాగా చదవలేకపోయాను. ఫెయిల్ అవుతానేమోనని భయంగా ఉంది నాన్న. క్షమించు.. అంటూ శుక్రవారం బంధువుల ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చే సమాయానికి మేఘన ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ చూసి బయపడి పోయిన మేఘన బంధువులు వెంటనే ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు హుటాహుటిన అక్కడికి చేరుకుని కూతురుని అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్టుండి మేఘన చనిపోవంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్షలో ఫెయిల్ అవుతానని ఆత్మహత్య చేసుకున్న మేఘన తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.