సృష్టి కర్త ఒక బ్రహ్మ.. ఆ బ్రహ్మను సృష్టించినదొక అమ్మ అని అంటారు. అందుకే తల్లిని మించిన దైవం లేదు. సృష్టికి ప్రతిసృష్టి అమ్మ. అలాంటి అమ్మని తిట్టాలంటేనే నోరు రాదు. అలాంటిది కొట్టడానికి చేతులు ఎలా వస్తాయో అర్ధం కాదు. అమ్మ విలువ తెలిసినవాళ్ళెవరూ తల్లిపై చేయి చేసుకోరు. కనీసం కొట్టేటప్పుడైనా.. ఆమె ఏడుపు చూసి అయినా, ఆ తల్లి ముఖం చూసైనా ఆపకపోతే ఎలా? నడి రోడ్డు మీద కన్న తల్లి అని కూడా చూడకుండా, కనికరం లేకుండా కాలితో తన్నాడో నీచుడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ లో చోటు చేసుకుంది. చుట్టూ జనం చూస్తుండగా.. రితేష్ వర్మ అనే యువకుడు తన తల్లిని జుట్టు పట్టుకుని ఇంట్లోంచి ఈడ్చుకొచ్చాడు. ఆ తర్వాత విచక్షణరహితంగా ఆమె మొఖంపై గుద్దుతూ.. కాలితో ఇష్టమొచ్చినట్టు తన్నాడు. అడ్డొచ్చిన వ్యక్తిని సైతం వెనక్కి నెట్టాడు.
ఆమె కొట్టొద్దు అంటూ వేడుకుంటున్నా కూడా జాలి లేకుండా దారుణంగా జుట్టు పట్టుకుని ఈడుస్తూ.. కొట్టాడు. పిడి గుద్దులు గుద్దుతూ.. కాలితో కడుపు మీద, మొఖం మీద తన్నాడు. దీంతో దాదాపు ఆమె లేవలేని స్థితిలో రోడ్డుపైనే పడిపోయింది. కొడుకు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు ఆమెను పైకి లేపి పక్కకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. విషయం తమ దృష్టికి వెళ్లడంతో మహారాజ్ గంజ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కుమారుడు రితేష్ వర్మపై ఐపీసీ 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఈ నెల 23వ తారీఖున చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కొడుకు ఖర్చు పెట్టిన డబ్బులకు సంబంధించి లెక్క చెప్పమని తల్లి అడిగినందుకే.. విచక్షణారహితంగా తల్లిని రోడ్డుపై కొట్టాడని స్థానికులు చెబుతున్నారు.
— MAHARAJGANJ POLICE (@maharajganjpol) November 26, 2022