నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కోరుకున్న వ్యక్తి భర్తగా రావడంతో ఆ మహిళ పట్టలేని సంతోషంతో ఉంది. ఇక పిల్లలతో సరికొత్త జీవితానికి నాంది పలకాలని అనుకుంది. కానీ పెళ్లై ఐదేళ్లు గడిచినా ఇంత వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. దీంతో సమాజం సూటిపోటి మాటలతో నిందిస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఆ మహిళ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. తాజాగా సిద్దిపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అది సిద్దిపేట పట్టణం భరత్‌నగర్ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన శివాని(23)ఐదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా మాచాపూర్ మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన మల్లేశంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో భార్యాభర్తలు పెళ్లైన అప్పటి నుంచి సిద్దిపేటలోని ముర్షద్‌గడ్డలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. భర్తతో పాటు కోరుకున్న జీవితాన్ని కూడా పొందుతున్నా శివానికి మనసులో ఏదో తెలియని వెలితి మెదులుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: Kanyakumari: దేశం కోసం పోరాడి గెలిచాడు! కానీ.. భార్య చేతిలో ఓడిపోయాడు!
పెళ్లై ఐదేళ్లు గడిచినా లోకం సూటి పోటి మాటలతో నిందించడం మొదలు పెట్టారు. ఇక ఈ క్రమంలోనే శివాని.. నాకు ఇంకా పిల్లలు కలగడం లేదనే బాధని బయటకు చెప్పలేక తనలో తానే కుమిలిపోతూ ఉండేది. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో తెలియదు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన శివాని ఆత్మహత్య చేసుకోవాలనే భావనకు వచ్చింది. మంగళవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో సిద్దిపేట పట్టణ శివారు ఇమాంబాద్ వార్డు వద్ద ఉన్న కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శివాని మరణవార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.