దేశంలో రానురాను నీఛమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. డబ్బు కోసమో.. రెండు నిమిషాల ఆనందం కోసమో.. పెళ్లి బంధాలను హేళన చేస్తూ పక్కదారులు తొక్కుతున్న పుణ్య పురుషులు, మహా పతివ్రతలు ఎందరో వెలుగులోకి వస్తున్నారు. కట్టుకున్న భర్త, కన్న పిల్లలు, పేగు బంధాలు అన్నవి ఏమీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అక్రమ సంబంధాల కోసం ప్రాణాలు తీయడం లేదా వారి ప్రాణాలపైకి తెచ్చుకోవడం చేస్తున్నారు. ఎన్ని వార్తలు వస్తున్నా, ఎన్ని సంఘటనలు జరుగుతున్నా వారిలో మార్పు రావడం లేదు. అలా అక్రమ సంబంధాలతో కాలం గడుపుతున్న ఓ మహిళ ఆ బంధానికే బలై పోయింది. అసలు సంగతి ఏంటంటే.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని బ్రహ్మపురి ప్రాంతంలో ఆబాద్, జుబేదా దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. చాలా సంతోషంగా కొన్నేళ్లుగా కాలం గడిపారు. ఉదయాన్నే ఇంటి నుంచి బయటకి వెళ్తే ఆబాద్ మళ్లీ తిరిగి ఇంటికొచ్చేది రాత్రికే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం నలుగురితో అక్రమ సంబంధం పెట్టుకుంది. జుబేదా అక్రమసంబంధాల వ్యవహారమే చివరికి వారిద్దరి ఉసురు తీసింది. ప్రియుడిగా ఉన్నవాడే చివరికి కాలయముడై భార్యభర్తలు ఇద్దరిని కత్తితో పొడిచి చంపాడు.
ప్రియుడిని తమ్ముడిగా పరియచం
రెండేళ్ల క్రితం సమీర్ అనే యువకిడిని తన తమ్ముడు అంటూ జుబేదా.. ఆబాద్‌కు పరిచయం చేసింది. అదే నిజమని ఆబాద్ కూడా నమ్మేశాడు. ఆబాద్ ఇంటి నుంచి బయటికి వెళ్లగానే సమీర్ వచ్చేవాడు. దాదాపు రెండేళ్లు అలాగే ఎంజాయ్ చేశారు. తర్వాత సమీర్‌కు మరో నిజం తెలిసి షాక్ తిన్నాడు. జుబేదాకు సమీర్ ఒక్కడే కాకుండా ఇంకో ముగ్గురితో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇదేంటని జుబేదాను నిలదీశాడు. ‘నీ భార్యను అదుపులో పెట్టుకోలేవా? నీకు చేత కాదా? అంటూ ఆబాద్‌ను కూడా గట్టిగా ప్రశ్నించాడు. ఇద్దరితో వాగ్వాదానికి దిగాడు సమీర్. ‘నా భార్యకు నచ్చినట్లు తిరుగుతది నీకెందుకు’ అంటూ ఆబాద్.. సమీర్‌తో వాదనకు దిగాడు. వారి మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఆగ్రహానికి గురైన సమీర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆబాద్, జుబేదాలను వారి పిల్లల ముందే పొడిచి చంపేశాడు.
దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
సమీర్‌ను తమ మామయ్యగా భావిస్తున్న చిన్నారులు పోలీసులకు అదే చెప్పారు. తమ బంధువే వారి తల్లిదండ్రులను హత్యచేసినట్లు పోలీసులకు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు నిజాలు తెలిశాయి. మీరట్ శివారులో మకాం వేసిన సమీర్‌ను అరెస్టు చేసి విచారణ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతను బంధువు కాదని జుబేదాతో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయాన్ని తెలుసుకున్నారు. జుబేదా సంబంధాలు అన్నీ ఆబాద్‌కు తెలుసని.. అందుకే రోజంతా ఇంటికి రాడని కూడా సమీర్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అన్నీ తెలిసినా ఆబాద్ పట్టించుకోలేదని అందుకే అతడిని కూడా చంపేశానని సమీర్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.