ఈ మధ్యకాలంలో బాలికలపై అత్యాచారాలు శృతిమించుతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెన్ని తెచ్చినా మార్పు మాత్రం అస్సలు రావటం లేదు. వావివరసలు మరి బరితెగించి ప్రవర్తిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కోట్ లోధిక పరిధిలోని ఒక ప్రైవేటు స్కూల్లో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు దినేశ్ జోషి అనే వ్యక్తి. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఆదర్శంగా నిలవాల్సింది పోయి సభ్యసమాజం తలదించుకునే చేశాడు.
ఇక పాఠశాలకు వచ్చిన బాలికలపై కన్నేస్తూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. స్కూల్ డైరెక్టర్ దినేశ్ జోషి ఓ రోజు ఇద్దరు బాలికలను పిలుచుకుని మీకు స్పెల్లింగ్స్ నేర్పిస్తానంటూ ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఇక అనంతరం వారిపై అక్కడక్కడ చేతులు వేస్తూ తాకరాని చోట తాకాడు. ఇదే విషయాన్ని బాధిత విద్యార్థులు ఇంటికెళ్లి తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలికల తల్లిదండ్రులు లోధిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దినేశ్ జోషిపై ఇది వరకే ఇలాంటి కేసులు అనేక మున్నాయని తెలియజేశారు.