ఓ మహిళ ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. కనికరం అనే మాటే మరిచి దుర్మార్గంగా వ్యవహరించి కిరాతకానికి పాల్పడింది. బార్ లో తప్పతాగి పడుకున్న ఓ వ్యక్తిపై ఓ మహిళ పెట్రోల్ పోసింది. ఇంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగా అతడికి నిప్పంటించింది. ఇదే కాకుండా ఈ దారుణాన్ని సెల్ ఫోన్ రికార్డ్ చేసుకుంది. ఇదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతోంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఆ మహిళ అతనిపై పెట్రోల్ పోసి ఎందుకు నిప్పటించిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది రష్యాలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఉన్న ఓ బార్ లో చాలా మంది మద్యం సేవించారు. అయితే ఓ వ్యక్తి మాత్రం మద్యం పీకలదాక తాగి ఓ చోట సోయిలేకుండా పడుకున్నాడు. దీంతో అతడిని చాలా మంది చూసి చూడనట్లుగా వదిలేశారు. కానీ ఓ మహిళ మాత్రం అతడికి సాయం చేయాల్సిందిపోయి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. మద్యం మత్తులో పడుకున్న ఈ వ్యక్తిపై ముందుగా పెట్రోలో పోసింది. అంతటితో ఆగకుండా పడుకున్న వ్యక్తికి నిప్పంటించింది. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి నిద్రలోనే కాలి బూడిదయ్యాడు.
ఈ దారుణాన్ని అంత ఆ మహిళ వీడియో కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. మరో విషయం ఏంటంటే? ఆ మహిళ కూడా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ కనికరం లేకుండా బరితెగించింది. అన్యాయంగా ఓ మనిషి ప్రాణాన్ని తీసింది. ఆ మహిళను పట్టుకుని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) December 20, 2022