సరిత-శ్రీకాంత్ దంపతులు. వీరికి ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. కట్ చేస్తే.. తాజాగా భర్త బ్లాక్ మెయిల్ తో భార్యను నమ్మించి దారుణంగా హత్య చేశాడు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
దేశంలో మహిళలపై రోజుకొక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. మరీ ముఖ్యంగా కొందరు భర్తలు.. కట్టుకున్న భార్యను నమ్మించి చివరికి గొంతు గొస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త.. బ్లాక్ మెయిల్ తో భార్యను నమ్మించి దారుణంగా హత్య చేశాడు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
అది రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పరిధిలోని కొత్తపల్లి గ్రామం. ఇక్కడే సరిత (25)-శ్రీకాంత్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అలా కొన్నేళ్ల పాటు ఈ దంపతుల సంసారం బాగానే నడిచింది. కానీ, రాను రాను భర్త శ్రీకాంత్ తాగుడుకు బానిసై దుర్మార్గుడిగా మారిపోయాడు. రోజూ భార్యను తిడుతూ, కొడుతూ బాగా టార్చర్ చేసేవాడు. ఇక భర్త దారుణాన్ని తట్టుకోలేక పోయిన సరిత.. గత 15 రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది.
దీంతో భర్త శ్రీకాంత్ భార్యకు ఫోన్ చేసి ఇంటికి రావాలంటూ బెదిరించేవాడు. భయంతో భార్య సరిత భర్త వద్దకు వెళ్లడానికి నిరాకరించింది. ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఇటీవల చనిపోతున్నట్లు బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఇక ఇదంతా నిజమే అనుకున్న భార్య సరిత.. భయంతో పరుగు పరుగున ఆదివారం భర్త వద్దకు వచ్చింది. ఇక భార్య రావడంతో శ్రీకాంత్ ఆమెపై కోపంతో ఊగిపోయాడు. అదే రాత్రి పిల్లలు తిని పడుకున్నారు. రాత్రి 10:30 నిమిషాలకు భర్త భార్యతో గొడవ పడ్డాడు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
కోపంతో ఊగిపోయిన భర్త శ్రీకాంత్.. భార్య గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు. అనంతరం శ్రీకాంత్.. నా భార్యను చంపేశానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సరిత తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. బ్లాక్ మెయిల్ చేసి భార్యను దారుణంగా హత్య చేసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.