ఆమె పేరు బండ అమృత (19). రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామం. ఇదే గ్రామానికి చెందిన బండ మహేశ్ తో అమృతకు గతంలో వివాహం అయింది. అయితే భర్త వ్యవసాయం చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగానే సాగింది. ఒకరిపై ఒకరు ప్రేమ, అప్యాయతలను ఒలకబొస్తూ కాపురాన్ని సంతోషంగానే గడిపారు. అప్పటి వరకూ వీరి కాపురంలో ఎలాంటి గొడవలు, వివాదాలు ఉన్న దాఖలాలు లేవట. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా భర్త చిన్నపాటి మందలింపుకే భార్య మనస్థాపానికి గురై ఇంట్లో నుంచి వెళ్లింది. ఇక విషయం ఏంటంటే?
అమృత బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఫోన్లో మరొకరితో మాట్లాడుతూ ఉంది. దీనిని మెల్లగా భర్త కనిపెట్టి ఈ సమయంలో ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావని ప్రశ్నించి, వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భార్య వెంటనే ఫోన్ కట్ చేసి పడుకుంది. ఆ తర్వాత భర్త కూడా పడుకున్నాడు. ఇక పడుకున్నట్టు ఆస్కార్ లెవల్ లో యాక్టింగ్ చేసిన అమృత భర్త నిద్రలోకి జారగానే మెల్లగా బెడ్ పై నుంచి లేచింది. చడిచప్పుడు కాకుండా బెడ్ రూం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత అదే బెడ్ రూంకు భర్త బయటకు రాకుండా గడియ పెట్టి అదే అర్ధరాత్రి భర్తకు దొరకకుండా పోయింది.
ఇది కూడా చదవండి: Love Fail: యువతి ఆత్మహత్య! చనిపోవటానికి ముందు సెల్ఫీ వీడియోలో..
దీంతో గంట తర్వాత నిద్రలో నుంచి లేచిన భర్త మెల్లగా భార్యను కనిపెట్టేందుకు వెనక్కితిరిగి చూశాడు. చూస్తే భార్య లేదు. బయటకు వెళ్లి చూద్దామనే సరికి గడియ పెట్టి ఉంది. ఇక ఎలాగో బయటకు వచ్చిన భర్త అటు ఇటు అంతా వెతికాడు. ఎక్కడా కూడా భార్య జాడ కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వస్తుంది. మనోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో గురువారం భర్త చేవేళ్ల పోలీసులకు నా భార్య బుధవారం అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.