Love Fail: ప్రియుడు పెళ్లికి నో చెప్పాడన్న మనస్తాపంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రియుడు చేసిన మోసాన్ని చెబుతూ కుమిలిపోయింది. ఈ సంఘటన గుజరాత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన రమీజ్, నటిష ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. అయితే, రోజులు గడుస్తున్న కొద్ది రమీజ్లో మార్పు రాసాగింది. నటిష పెళ్లి పేరు చెబితే మాట దాటేసేవాడు. కొద్దిరోజుల క్రితం నటిష పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. రమీజ్ ఆమెను పెళ్లి చేసుకోవటం కుదరదు అన్నాడు. దీంతో నటిష మనస్తాపం చెందింది. ప్రియుడు తనను మోసం చేశాడని అల్లాడిపోయింది. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.
అహ్మదాబాద్‌లోని సబర్మతీ నది దగ్గరకు వెళ్లింది. నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. అయితే, అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. అందులో తన బాధను చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో ‘‘ రమీజ్! నువ్వు నన్ను చాలా దారుణంగా మోసం చేశావు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను ఫూల్‌ను చేశావు.
నేను ఓ తప్పుడు వ్యక్తిని ఎంచుకున్నాను. ఇలా జరిగుండాల్సింది కాదు. నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించాను. కానీ, నువ్వు నన్ను ఎంతో మోసం. నేను నువ్వు అందరికంటే ప్రత్యేకమైన వాడివనుకున్నాను. కానీ, నువ్వు కూడా అందరి లాంటి వాడివేనని తేలింది’’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Eluru: పాలకోసం బైక్‌పై వెళుతూ అన్నదమ్ముల సజీవ దహనం