Woman: తమ ఇష్టానికి వ్యతిరేకంగా కొడుకుని పెళ్లి చేసుకోవటమే కాకుండా, డబ్బులు డిమాండ్ చేస్తోందని కోడిలిపై దారుణానికి తెగబడ్డారు అత్తింటివారు. కోడల్ని నడిరోడ్డుపైకి తీసుకొచ్చి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ సంఘటన రాజస్తాన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, చురు జిల్లా, సర్ధార్ సిటీకి చెందిన ప్రీతి(23)కి 2020, నవంబర్ నెలలో దినేష్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఈ పెళ్లి దినేష్ తల్లిదండ్రులకు ఇష్టంలేదు. అయినప్పటికి ప్రీతిని ఇంట్లోకి ఆహ్వానించారు. కొన్ని నెలలు వీరి కాపురం సాఫీగానే సాగింది. ఆ తర్వాతినుంచి అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భార్యాభర్తలు వేరుకాపురం పెట్టారు. ఆ తర్వాత ప్రీతి అత్త భగవతి.. దినేస్ మనుసు మార్చేసి ఆమె వైపు తిప్పుకుంది. అతడు తల్లి దగ్గరకు వెళ్లిపోయాడు.
దీంతో ప్రీతి తన స్నేహితురాలితో కలిసి ఉంటోంది. ప్రీతి తన భర్త గురించి మాట్లాడదామని గురువారం మామ హంసరాజ్ షాపుకు వెళ్లింది. అక్కడ ఈ విషయమై నలుగురికి గొడవైంది. అత్త, మామ, భర్తలు కలిసి ప్రీతిపై విరుచుకుపడ్డారు. భర్త ఆమె జుట్టు పట్టుకోగా.. అత్త కర్రతో చావగొట్టింది. ఇంట్లో మాంసం తినకూడదని తెలిసినా తిన్నందుకు ప్రీతిని కొడుతున్నామని అక్కడి జనానికి చెప్పారు. మామ ఆమెపై కిరోసిన్ పోసి, కాల్చి చంపుతానని బెదిరించాడు. కొద్దిసేపటి తర్వాత వారంతా అక్కడినుంచి వెళ్లిపోయారు.
గాయాలపాలైన ప్రీతిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లారు. ప్రీతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో చాలా సార్లు అత్తింటివారి వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అంది. అయితే, మామ కూడా ఆమెపై ప్రత్యారోపణలు చేశాడు. కోడలు తమను డబ్బులు డిమాండ్ చేస్తోందని అన్నాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ranga Reddy:అర్ధరాత్రి ఫోన్ లో మరొకరితో భార్య.. భర్తకి తెలియగానే!