ఆమె పేరు సోనాలి. వయసు 29 ఏళ్లు. ఉన్నత చదువులు చదివి డాక్టర్ అవ్వాలనే తన కలను నిజం చేసుకుంది. వైద్యం చేస్తూ ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తుంది. అలా ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. దీంతో కన్నవాళ్ల ప్రేమను కాదని, తన దారేంటో తాను చూసుకుంది. చివరికి తల్లిదండ్రుల కంట కన్నీరును మిగిల్చి అందనంత దూరాలకు వెళ్లిపోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ మధురాదాస్ లోని ఓ ఆస్పత్రిలో సోనాలి (29) డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది. పై చదువులు చదివి డాక్టర్ కలను నిజం చేసుకుంది. అలా ఆమె జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలోనే కొలిగ్ డాక్టర్ అయిన అంకిత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇతనికి ఇది వరకే పెళ్లైంది. ఒకే ఆస్పత్రిలో పని చేస్తుండడంతో ఇద్దరు కాస్త సన్నిహితంగా మెలిగారు. ఇక రాను రాను వీరి పరిచయం చివరికి ప్రేమించుకునే దాక వెళ్లింది. దీంతో సమయం దొరికినప్పుడల్లా సినిమాలకు, షికారులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
అంకిత్ ప్రేమలో మునిగిపోయిన సోనాలి.., నేను పెళ్లి చేసుకుంటే ఇతడినే చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయింది. అయితే ఈ క్రమంలోనే అంకిత్ ప్రేమ వ్యవహారం అతని భార్యకు చెవిన పడింది. ఇక కోపంతో ఊగిపోయిన అంకిత్ భార్య.. సోనాలి ఉంటున్న హాస్టల్ కు వెళ్లి అందరి ముందే సోనాలిని అనరాని మాటలు అనేసింది. అంకిత్ కు దూరంగా ఉండాలని హెచ్చరించడంతో పాటు సోనాలి తల్లిదండ్రులకు కూడా ఆమె సాగిస్తున్న ప్రేమ విషయాన్ని చెప్పింది. ఇక అందరి ముందు నా పరువు పోయిందని భావించిన సోనాలి తీవ్ర మనస్థాపానికి లోనైంది.
దీంతో ఇలాంటి బతుకు నాకొద్దు అనుకుని.. నా జీవితంలో ఏం మిగలేదు. బతకాలనే ఆశలేదు, క్షమించండి అంటూ సోనాలి సూసైడ్ నోట్ రాసి చివరికి ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణ వార్త తెలుసుకున్న సోనాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.