సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో జరిగిన ఏ సమాచారం అయినా క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది. దీనికి తోడు మారిన కాలానికి అనుగుణంగా పొలం పనులకు వెళ్లే రైతుల నుంచి స్కూలుకు వెళ్లే పిల్లల వరకు ప్రతీ ఒక్కరి చేతులో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే గతంలో టిక్ టాక్ అందుబాటులో ఉండడంతో ప్రతీ ఒక్కరు తమ టాలెంట్ ను చూపించుకునేవారు. దీంతో రాత్రికి రాత్రే సెలబ్రెటీ స్టేటస్ ను సంపాదించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. దీంతో మేము కూడా సెలబ్రెటీ అయిపోవాలన్న ఆశతో టిక్ టాక్ చేసేవారు.
అయితే అది పూర్తిగా బ్యాన్ కావడంతో ఇప్పుడు జనాలు అంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మీద పడ్డారు. చిన్న పిల్లల నుంచి పెళ్లైన మహిళల వరకు ఇలా తమకు నచ్చిన పాటలు, డైలాగ్ లకు రీల్స్ చేస్తున్నారు. అయితే ఇచ్చం ఇలాగే రీల్స్ చేయబోయిన ఓ భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. బీహార్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. భోజ్ పూర్ ప్రాంతంలో అన్నూ, అనిల్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై పదేళ్లు అవుతుంది. పెళ్లైన కాలం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దంపతులు సంతోషంగా జీవించారు.
ఇదిలా ఉంటే గత కాలం నుంచి అనిల్ భార్య అన్నూ ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంది. భార్య రీల్స్ చేయడం భర్తకు అస్సలు నచ్చలేదు. దీంతో భర్త భార్యకు అనేక సార్లు చెప్పి చూశాడు. అయినా భార్య తీరు మార్చుకోకుండా అదే పనిగా రీల్స్ చేస్తూనే ఉంది. ఇక ఇటీవల కూడా భార్య అన్నూ రీల్స్ చేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన అనిల్ భార్య గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.