సెలవు ఇవ్వలేదని మనస్థాపానికి గురైన సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతని పేరు నరేష్ జాట్. రాజస్తాన్ జోధ్‌పుర్‌లో సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నరేష్ ఆదివారం సెలవు కావాలని ఉన్నతాధికారులను కోరాడు. దీంతో స్పందించిన అధికారులు కొన్ని కారణాల వల్ల నరేష్ కు సెలవు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన నరేష్ తన సహోద్యోగి చేతిని కొరికాడు.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కాస్త మాటల దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే నరేష్ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు పాల్డి ఖించియాన్‌లోని CRPF శిక్షణా కేంద్రంలోని తన నివాసంలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకున్నాడు. అనంతరం బాల్కనీ నుండి తన INSAS రైఫిల్‌ను చూపుతూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ గాలిలో కాల్పులు జరిపాడు. ఒక గంటలో అతను ఎనిమిది రౌండ్లు కాల్చాడు.
ఇది కూడా చదవండి: Gujarat: దారుణం: కన్న తల్లిని గొంతు కోసి చంపిన కసాయి కొడుకు
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, CRPF అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జవాన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు, కానీ ఎంతకు జవాన్ నరేష్ వెనక్కి తగ్గలేదు. అందరూ చూస్తుండగానే తన చేతిలో ఉన్న గన్ తో తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే నరేష్ ఇంటికి వెళ్లిన ఉన్నతాధికారులు అతని వద్ద ఉన్న గన్ ను స్వాధీనం చేసుకున్నారు. అతనికి ఎన్నో రకాలుగా చెప్పామని, ఒప్పించేందుకు అనేక మార్గాలు వెతికామని అయినా వినకుండా ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని ఉన్నాధికారులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.