ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే ఇటీవల వారికి రూ.13 లక్షల ఆదాయం వచ్చింది. ఆ వచ్చిన డబ్బును ఇంట్లో బీరువాలో దాచిపెట్టారు. ఇక మరుసటి రోజు బీరువా తెరిచి చూడగా.. ఆ డబ్బుంతా మాయమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ తో అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా చివరికి ఫిర్యాదు చేసిన యజమానినే అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగింది? ఇంతకు దొంగతనం చేసింది ఎవరంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామం. ఇక్కడే గడ్డం వీరయ్య, సింగారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరూ గత కొన్ని రోజుల నుంచి పొటేళ్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు. అయితే వ్యాపారంలో భాగంగా ఇటీవల వీళ్లు కొన్ని పొటేళ్లను అమ్మగా ఏకంగా రూ. 13 లక్షల ఆదాయం వచ్చింది. ఆ వచ్చిన డబ్బును మీ ఇంట్లోనే భద్రపరుచుకోవాలని సింగిరెడ్డి వీరయ్యను కోరాడు. దీనికి వీరయ్య కూడా సరేనంటూ ఆ డబ్బంతా తన ఇంట్లోనే బీరువాలో దాచుకున్నాడు. అయితే ఈ ఆదివారం రాత్రి వీరయ్య తన భార్యతో కలిసి తమ బంధువుల ఇంటికి వెళ్లాడు.
ఇక మరుసటి రోజు తిరిగి ఇంటికి రాగానే వీరయ్య ఇంట్లో బీరువాలో దాచుకున్న డబ్బు కనిపించకుండా పోయింది. దీంతో షాక్ గురై వీరయ్య, సింగిరెడ్డి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ తో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ డబ్బులను దొంగిలించింది ఎవరో కాదు, ఇంటి యజమాని వీరయ్యే అంటూ పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు. చివరికి వీరయ్య కూడా తన నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏదో చేద్దాం అనుకుంటే చివరికి ఏదో జరిగిందంటూ వీరయ్య తనలో తాను కుమిలిపోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఎరక్కపోయి ఇరుక్కుపోయిన వీరయ్య ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.