బాగా తెలిసిన వారు అయినా తాగి తలుపు తడితేనే ఇంట్లోకి రానివ్వాలా వద్దా అని ఆలోచించే రోజులివి. అసలే రోజులు బాలేదు. బాగా తెలిసిన వారు కాదు, ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. అలాంటిది నెల రోజుల క్రితం పరిచయమైన వాడ్ని ఇంట్లోకి రానిస్తే.. ఏమీ చేయకుండా ఉంటాడా? పైగా తాగొచ్చిన వాడ్ని ఇంట్లోకి రానిస్తే ఇంకేమైనా ఉందా? కానీ ఒక యువతి మాత్రం తాగితే ఏంటి, తెలిసిన వాడే కదా అని ఇంట్లోకి రానిచ్చింది. అమ్మాయి చూస్తే 30+. ఇక ఆ తాగుబోతోడి కన్ను ఆ యువతి మీద పడకుండా ఎలా ఉంటుంది? ఒంటరిగా ఉందని పైశాచికంగా మీద పడి కోరిక తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమెను తిడుతూ దాడి చేశాడు. ఎలాగోలా ఆ యువతి తప్పించుకుని బయటకు వచ్చింది. కానీ ఆ దుర్మార్గుడిని మాత్రం వదిలిపెట్టలేదు. పోలీసులకు అప్పజెప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 34 ఏళ్ల యువతి ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన హర్జీత్ యాదవ్ (39) ఆ యువతిపై అత్యాచారం చేసి.. దాడి చేశాడు. తాగిన మైకంలో తూలుతున్న యాదవ్ ను.. తెలిసినవాడే కదా అని తన రూమ్ కి రానిచ్చింది ఆ యువతి. అయితే తాగిన మైకంలో కళ్ళు కామంతో మూసుకుపోవడంతో యువతిపై కన్నేశాడు. యువతిని పాడు చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. దీంతో ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ యువతి తప్పించుకుని యాదవ్ ను గదిలో ఉంచి తాళం వేసింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది.
రంగంలోకి దిగిన పోలీసులు యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. యాదవ్ ఆమెకు 45 రోజులుగా తెలుసని, తెలిసిన వ్యక్తి కదా అని ఇంట్లోకి రానిస్తే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, మీ ఎయిర్ హోస్టెస్ లకిది మామూలే కదే అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశాడని ఆ యువతి పోలీసులకు తెలిపింది. అయితే అత్యాచారం చేసిన యాదవ్.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత అని, ఖాన్పూర్ ఏరియా బ్లాక్ ప్రెసిడెంట్ అని పోలీసులు వెల్లడించారు. యాదవ్ పై అత్యాచారం, అసహజమైన నేరాలు, మహిళని కించపరచడం, బాధ కలిగించడం వంటి సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. దీన్ని బట్టి అమ్మాయిలు అర్ధం చేసుకోవలసింది ఏంటంటే.. ఎంత తెలిసిన వాడు అయినా సరే తాగిన మైకంలో ఉన్న వారిని మాత్రం ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి రానివ్వకూడదు. రానిస్తే ఇదిగో ఇలానే ప్రవర్తిస్తారు. తస్మాత్ జాగ్రత్త.
An air hostess was allegedly raped and assaulted by a Congress member at her residence in South Delhi on Sunday, police said. Police identified the accused as Harjeet Yadav (39) and said he has been sent to judicial custody.https://t.co/MFx3s8ZhUN
— Express Delhi-NCR (@ieDelhi) September 26, 2022