ఇన్‌స్టాగ్రామ్ స్టార్ తమన్నా కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసం వెతుకుతున్నారు. ఆమె దొరకగానే అరెస్ట్ చేసేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెట్టి, కొంతమంది స్టార్‌లుగా వెలుగొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా పలు సామాజిక మాధ్యమాల ద్వారా పేరుతో పాటు డబ్బు కూడా సంపాదించే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే, తమ అభిమానుల్ని సంతోషపెట్టడానికి సదరు సోషల్ మీడియా సెలెబ్రిటీలు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. తద్వారా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ స్టార్ తమన్నా తన వీడియోల కారణంగా చిక్కుల్లో పడింది. ఆమె ప్రస్తుతం పోలీస్ కేసును ఎదుర్కొంటోంది. పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి ‘ఫ్యాన్స్ కాల్ మీ తమన్నా’ పేరిట ఓ ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌ను నడుపుతోంది. ఆ ఖాతాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తరచుగా హింసను ప్రోత్సహించే లాంటి వీడియోలు చేస్తూ ఉంటుంది. సిగరెట్ తాగటం, కత్తితో విన్యాసాలు చేయటం వంటివి ఆమె వీడియోల్లో తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి పోలీసుల దృష్టికి కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెపై చర్యలకు సిద్దమయ్యారు. విషయం తెలుసుకున్న సదరు యువతి పరారీలో ఉంది.
పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. త్వరలో ఆమెను అరెస్ట్ చేస్తామని అన్నారు. ఎవ్వరూ హింసను ప్రోత్సహించే వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అంటున్నారు. ఇక, తమన్నా వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అతి ఎప్పటికైనా అనర్థదాయకమే..’’.. ‘‘ పేరు కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తే తమన్నాకు పట్టిన గతే అందరికీ పడుతుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
She is Thamanna from Coimbatore. She has a instagram page named fans call me Thamanna. The city police formed a special team to nab her for posting videos with deadly weapons on her instagram account. @gurusamymathi @gurujourno @ToiJack @vijay_vast @DevanathanvTOI pic.twitter.com/BVylYl8pon
— SubburajTOI (@ASubburajTOI) March 7, 2023