భార్య సహనానికి ఓ భర్త పరీక్ష పెట్టాడు. ఇన్నాళ్లు కుక్కిన పేనులా పడి ఉంటుందనుకున్న భార్య ఒక్కసారిగా వీర వనితగా మారిపోయింది. ఎకంగా భర్తను నడి రోడ్డుపై స్థంభానికి కట్టేసి చెప్పుతో కొట్టింది. అసలు కట్టుకున్న భర్తను భార్య స్థంభానికి కట్టేసి కొట్టడానికి కారణం ఏంటి? భర్త చేసిన అంత పెద్ద తప్పు ఏంటనే కదా మీ ప్రశ్న? అది తెలియాలంటే పూర్తి స్టోరీ చదవాల్సిందే.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి. ఇదే గ్రామంలో అఖిల, శ్రీకాంత్ రెడ్డి అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై నాలుగేళ్లు అవుతుంది. కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు. అప్పటి వరకు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కొడుకు పుట్టిన ఆనందంలో వీరి సంసారం కొన్నాళ్లు బాగానే నడిచింది. ఈ క్రమంలోనే భర్త శ్రీకంత్ రెడ్డి భార్యను కాదని హన్మకొండకు వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నా భర్త ఇంటికి మాత్రం రాలేదు.
దీంతో అనుమానం వచ్చిన భార్య.. భర్త హన్మకొండలో ఏం చేస్తున్నాడనే అన్ని వివరాలు రాబట్టుకుంది. అయితే ఆమెకు దిమ్మతిరిగే వార్త తెలిసింది. అది ఏంటంటే? భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని. ఇదే విషయాన్ని అఖిల తన కుటుంబ సభ్యులకు చెర వేసింది. వీరి సాయంతో రెండో భార్యతో ఉన్న భర్తను అఖిల స్వగ్రామమైన స్వర్ణపల్లికి తీసుకొచ్చింది. ఇక వచ్చిన వెంటనే భార్య భర్తను గ్రామంలోని ఓ స్థంభానికి కట్టేసి చెప్పుతో దారుణంగా కొట్టింది. నన్ను కాదని రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటూ చెప్పల దండ భర్త మెడలో వేసి దారుణంగా చితకబాదింది. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. వీర వనితలా మారి భర్తకు చక్కటి గుణపాఠం చెప్పిన భార్య తీరుపై నెటిజన్స్ సలాం కొడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.