కొద్దిపాటి క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలకు జీవితంలో పూడ్చలేని విషాదం మిగిలిపోతుంది. నేటి కాలంలో కొందరు వ్యక్తులు చిన్న చిన్న కారణాలకే ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ హత్యలు చేయడం లేదంటే, ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ సొంత తండ్రినే అతని కుమారుడు అతి కిరాతంగా హత్య చేసిన ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పాకిస్థాన్లోని కరాచీ ప్రాంతం. ఓ కుమారుడు తండ్రితో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే కొడుకు చెప్పిన మాట వినకుండా, బుద్దిగా చదువుకోకుండా చెడు తిరుగుల్లు తిరుగుతున్నాడు. వాడు ఎక్కడ చెడిపోతాడోనన్న భయంతో తండ్రి కుమారుడిని అనేక సార్లు మందలించే ప్రయత్నం చేశాడు. అప్పుటికీ వినకపోయేసరికి కుమారుడిపై తండ్రి చేయి కూడా చేసుకున్నాడు. దీంతో ఆ కుమారుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఇది కూడా చదవండి: Bengaluru: ప్రియుడి కోసం ప్రియురాలు ఇదేం త్యాగం! తల్లి ముందే అడ్డంగా బుక్కైన కూతురు!
ఇక ఇంతటితో ఆగకుండా ఏకంగా తండ్రిపైనే పగ పెంచుకుని విషపు ఆలోచనలు చేశాడు. ఎలాగైన తండ్రిని హత్యచేయాలని భావించి అనేక రకాలు ప్రయత్నాలు చేశాడు. ఇక ఎట్టకేలకు అదును చూసుకుని తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇంతటితో ఆగడా అంటే అదీ లేదు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు సుత్తితో తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అలా నరికి శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో పడేశాడు. మిగిలిన శరీర భాగాలకు నిప్పు పెట్టి కాల్చాడు. ఇక కొన్ని రోజుల తర్వాత కరాచీలోని సూపర్ హైవే అప్గాన్ బస్తీ వద్ద ముక్కలు చేసి ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు.
ఇక కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా పోలీసులకు కళ్లు బైర్లు నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొడుతున్నాడనే కారణంతో సొంత కుమారుడే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసింది. ఇక దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేయగా ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేశానంటూ కొడుకు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.