దిశ హత్యకేసు… అప్పట్లో ఈ కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదనే చెప్పాలి. అర్థరాత్రి దిశపై సాముహిక అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో భాగంగా పోలీసు యాంత్రాంగం వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పడు ఇదంతా ఎందుకంటారా..? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతంలో ఎన్ కౌంటర్ లో మరణించిన చెన్నకేశవులు భార్య రేణుక మంగళవారం విచారణ కమిషన్ ను ఆశ్రయించింది.
పోలీసులు కావాలనే నా భర్తను ఎన్ కౌంటర్ చేశారని తెలిపింది. అరెస్ట్ అయిన తర్వాత పోలీసుల ఎదుట పలుమార్లు కిందపడి పోడిపోతున్నాడని వాళ్లే నాకు చెప్పారని, అలాంటి వ్యక్తి పోలీసుల మీదుకు ఎలా ఎదురు తిరుగుతాడని కమిషన్ ఎదుట రేణుక వాపోయింది. ఆయన కిడ్ని సమస్యతో బాధపడ్డాడు. దానికి సంబంధించిన రిపోర్టులను సైతం పంపించానని రేణుక తెలిపింది. ఇది పూర్తిగా నకిలీ ఎన్ కౌంటర్ అని నా భర్తను కావాలని పోలీసులు చంపారంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో నా కుటుంబం రోడ్డున పడిందని, ఇక నాకు ఎలాగైన చేయాలంటూ రేణుక వాపోయింది. ఇక చెన్నకేశవుల భార్య రేణుక ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.