New York: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ ఆత్మహత్య చేసుకుంది. మగ బిడ్డ కావాలంటూ భర్త తనను వేధిస్తున్నాడని ఈ నిర్ణయం తీసుకుంది. ఓ సెల్ఫీ వీడియోలో తన బాధను చిత్రీకరించి జీవితాన్ని ముగించింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మనిదీప్ కౌర్‌కు 2015లో అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లయింది. పెళ్లయిన కొన్ని సంవత్సరాలకు మనిదీప్ భర్త కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లో సెటిల్ అయ్యింది.
మనిదీప్‌కు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అయితే, తమకు మగబిడ్డ కావాలని భర్త కుటుంబం వేధించసాగింది. 50 లక్షల రూపాయలు అదనపు కట్నం తేవాలంటూ హింసించసాగింది. దాదాపు ఎనిమిదేళ్లు ఆమె నరకం అనుభవించింది. వేధింపులు రోజురోజుకు ఎక్కువవటంతో భరించలేకపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. చనిపోయే ముందు తన బాధను సెల్ఫీ వీడియో రూపంలో చిత్రీకరింది. ఆ వీడియోలో.. ‘‘ నా చావుకు నా భర్త, అత్తింటి వాళ్లే కారణం. వాళ్లు నన్ను బతికనివ్వలేదు. నా భర్త నన్ను 8 ఏళ్లుగా టార్చర్ పెడుతున్నాడు.
ఎప్పటికైనా మారతాడు అనుకున్నాను. కానీ, అలా జరగలేదు. 8 ఏళ్లుగా ప్రతీరోజు నన్ను కొడుతున్నాడు. అన్ని విధాలుగా నేను ప్రయత్నించాను. ప్రతి రోజు దాడికి గురయ్యాను. ఇక ఆ బాధను నేను తట్టుకోలేను. న్యూయార్క్‌కు వచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. తాగి ఉన్నా తాగకపోయినా నన్ను మాత్రం కొట్టేవాడు. నా భర్తకు ఓ ఎఫైర్ కూడా ఉంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి, మనిదీప్ కౌర్ ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
There are collosal problems in our family & social structure which we conveniently ignore or deny to accept. #DomesticViolence against women is one such serious problem. Suicide by Mandeep Kaur a NRI Punjabi woman is a wake up call to accept the problem and fix it accordingly. pic.twitter.com/F8WpkiLCZY
— Gurshamshir Singh (@gurshamshir) August 5, 2022
ఇవి కూడా చదవండి : ఒకరికి తెలియకుండా ఒకరితో పెళ్లి.. నిత్య పెళ్లికొడుకు గుట్టు రట్టు!