ఆమె పేరు కస్తూరి. చాలా ఏళ్ల కిందటే మల్లేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. అయితే ఇటీవల భార్య కస్తూరి పనికి వెళ్తున్నానని భర్తకు చెప్పి వెళ్లి.. చివరికి పాడుబడ్డ ఇంట్లో ఊహించని స్థితిలో కనిపించింది. భార్యను అలా చూసి భర్త షాక్ గురయ్యాడు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన కస్తూరికి గత ఐదేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. భర్త ఒక్కడే కష్టపడుతుంటే భార్య చూడలేకపోయింది. దీంతో కొన్ని రోజుల తర్వాత కస్తూరి కూడా స్థానికంగా ఉండే ఓ కంపెనీలో ఉద్యోగానికి వెళ్లింది. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుంటున్నారు. అలా వీరి కాపురం సజావుగానే సాగింది. ఇదిలా ఉంటే ఈ నెల 22న భార్య కస్తూరి పనికి వెళ్తున్నానని భర్తకు చెప్పి వెళ్లింది. కట్ చేస్తే.. పొడుబడ్డ ఇంట్లో భార్యను అలా చూసి భర్త తట్టుకోలేకపోయాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ పట్టణంలోని ఆర్యానగర్ బ్యాంక్ కాలనీలో కస్తూరి (28)-మల్లేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే భర్త పనికి వెళ్లడంతో కస్తూరి ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఇది ఇష్టం లేని కస్తూరి తాను కూడా పని చేస్తానంటూ స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనికి వెళ్లింది. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తూ సంసారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 22న కస్తూరి ఎప్పటిలాగే పనికి వెళ్తున్నానని భర్తకు చెప్పి వెళ్లింది. సాయంత్రం అయినా భార్య తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో ఖంగారుపడ్డ భర్త నగరంలో అంతటా గాలించాడు. కానీ, భార్య ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక భర్త మల్లేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే బ్యాంక్ కాలనీ పరిధిలో ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో నుంచి రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది. ఏంటా అని స్థానికులు అందులోకి వెళ్లి చూడగా.. ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఖంగుతిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని పరిశీలించగా.. కనిపించకుండా పోయిన కస్తూరి అని గుర్తించారు. వెంటనే ఆమె భర్త మల్లేష్ కు సమాచారం అందించారు. పరుగు పరుగున వచ్చి భార్యను అలా చూసి మల్లేష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు సైతం గుండెలు పగిలేలా ఏడ్చాడు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కస్తూరి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.