ఈ రోజుల్లో యువత చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైందని, చదువులో రాణించలేకపోతున్నానని, తల్లిదండ్రులు మందలించారనే కారణాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోవడం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి కారణాల్లోనే ఓ యువతి ఇంట్లో నుంచి కనిపించకండపోయిన ఘటన తాజాగా నిజామాబాద్ చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కోటగిరి ప్రాంతానికి చెందిన కౌసర్ సుల్తానా( 22) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఇటీవల కుటుంబ సభ్యులు ఆమెను మందలించారని ఇంట్లో నుంచి కనిపించకుండపోయింది. సరిగ్గా ఈ నెల17న బోధన్ మార్కెట్ కు వెళ్లొస్తాననని ఇంట్లో చెప్పి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ తల్లిదండ్రులు చుట్టు పక్కల గ్రామాల్లో అంతట వెతికారు.
ఎంతకు కూడా సుల్తానా జాడ కనిపించలేదు. ఇక ఏం చేయాలో తెలియక సుల్తానా కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.