నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమకు నిరాకరించిందని కోపంతో రగిలిపోయిన యువకుడు యువతి గొంతు కోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మాణిక్ బండారు గ్రామానికి చెందిన సంజయ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే సంజయ్ మొపాల్ మండలం చిన్నపూర్ గ్రామానికి చెందిన యువతితో కాస్త పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే సంజయ్ ఆ యువతిని ప్రేమించాలంటూ వెంటపడేవాడు.
దీనికి ఆ యువతి నిరాకరించింది. అయినా సరే సంజయ్ ఆ యువతి వెంట పడుతూనే ఉండేవాడు. దీంతో అతని ప్రవర్తనతో విసుగు చెందిన ఆ యువతి అనేక సార్లు అతడిని గట్టిగానే మందలించింది. దీంతో అప్పటి నుంచి సంజయ్ ఆ యువతిపై కోపంతో రగిలిపోయాడు. ప్రేమించాలని, లేకుంటే నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురి చేసేవాడు. అయితే సంజయ్ ఇటీవల ఆ యువతిని మరోసారి నా ప్రేమను అంగీకరించాలంటూ తెలిపాడు. దీంతో మరోసారి ఆ యువతి అతని ప్రేమకు నో చెప్పింది.
ఇది కూడా చదవండి: West Bengal: మహిళ చేతికి వెయ్యి రూపాయలు ఇచ్చి మూడు గంటల పాటు నరకం!