ఆమెకు పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. కొంత కాలం నుంచి భర్తకు దూరంగా ఉంటూ ప్రియుడికి దగ్గరైంది. కొన్ని రోజుల నుంచి ప్రియుడితో పాటు కలిసి ఉంటుంది. అయితే ఓ రోజు రాత్రి ఆ టైమ్ లో కూతురు ఏడ్చిందని..!
ఈ రోజుల్లో కొందరు మహిళలు భర్తను కాదని మరో కుంపటిని పెట్టుకుంటున్నారు. మొగుడి కళ్లు గప్పి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నారు. అసలు విషయం తెలిసి భర్త మందలించడంతో చివరికి కట్టుకున్న మొగుడికే పాడే కడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఇకపోతే ప్రియురాలితో గడిపేందుకు ఆమె కూతురు అడ్డుగా ఉందని ఎవరూ ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటననే తాజాగా నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో దేవుళ్ల సంజీవ్ (27) అనే యవకుడు నివాసం ఉండేవాడు. ఇతడు స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇతనికి రజిత అనే మహిళ పరిచయం అయింది. ఆమెకు గతంలో పెళ్లై 3 ఏళ్ల కూతురు కూడా ఉంది. భర్తతో విభేదాలు రావడంతో అప్పటి నుంచి ఆ వివాహిత ఒంటరిగా ఉంటుంది. ఇక ఆమెకు సంజీవ్ పరిచయం కావడంతో అతనితో లవ్వాల మొదలు పెట్టింది. అలా వీరి బంధం చివరికి వివాహేతర సంబంధంగా మారింది. దీంతో సంజీవ్ తన ప్రియురాలితో పాటు తన ఇంట్లోనే కాపురం పెట్టాడు.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ రోజు రాత్రి సంజీవ్, రజిత ఇద్దరూ మోతాదుకు మించి మద్యం సేవించారు. ఇక అర్థరాత్రి కూతురు నిద్రలేచి ఆకలి కోసం ఏడ్చింది. ఆ చిన్నారి ఏడుపుకు నిద్రలేచిన సంజీవ్ దారుణానికి పాల్పడ్డాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడం, రాత్రిపూట రోజూ ఏడుస్తుండడంతో సంజీవ్ ప్రియురాలి సాయంతో ఆ చిన్నారి గొంతు పిసికి హత్య చేశాడు. అనంతరం ఈ చిన్నారి మృతదేహాన్ని స్థానిక చెరువులో పడేశాడు. మరుసటి రోజు చిన్నారి కనిపించకపోవడంతో స్థానికులు రజితను ప్రశ్నించారు.
దీంతో ఆ మహిళ పొంతనలేని సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంజీవ్, రజితను ప్రశ్నించగా అసలు నిజాలు ఒప్పుకుని నేరాన్ని అంగీకరించారు. ఆ తర్వాత పోలీసులు నిందితులను ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఏడుస్తుందని ప్రియురాలి సాయంతో 3 ఏళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన ప్రియుడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.