ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ యువకుడు సీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు హాస్టల్ లోనే ఉంటూ కాలేజీకి వెళ్లేవాడు. అయితే ఇటీవల ఆ యువకుడు ఉన్నట్టుండి హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు హాస్టల్ వార్డెన్ కు తెలియజేశారు. ఈ వార్త తెలుసుకున్న ఆ వార్డెన్ సైతం గుండెపోటుతో మరణించాడు. నిమిషాల్లోనే హాస్టల్ లో ఇద్దరు మరణించడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నెల్లూరు జిల్లా గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో పులివెందులకు చెందిన ధరణేశ్వర్ రెడ్డి అనే యువకుడు సీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఈ యువకుడు హాస్టల్ లోనే ఉంటూ రోజూ కాలేజీకి వెళ్లేవాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ యువకుడు గత కొన్ని రోజుల నుంచి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ధరణేశ్వర్ రెడ్డి హాస్టల్ లోని తన రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తోటి విద్యార్థులు అతని రూమ్ లోకి వెళ్లి చూడగా.. ధరణేశ్వర్ రెడ్డి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు.
ఈ సీన్ చూసిన అతని స్నేహితులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ క్షణంలో వారికి ఏం చేయాలో తెలియక.. వెంటనే ఇదే విషయాన్ని హాస్టల్ వార్డెన్ అయిన శ్రీనివాసులు నాయుడికి తెలియజేశారు. ఈ వార్త విన్న శ్రీనివాసులు నాయుడు ఉన్నట్టుండి అతడు కూడా కుప్పకూలాడు. వెంటనే హాస్టల్ సిబ్బంది హుటాహుటిన శ్రీనివాసులు నాయుడిని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక పరీక్షించిన వైద్యులు.. శ్రీనివాసులు నాయుడు గుండెపోటుతో మరణించాడని తెలిపారు.
ఆ తర్వాత హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు హాస్టల్ కు చేరుకుని ఉరి వేసుకున్న ధరణేశ్వర్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక హాస్టల్ లో చనిపోయిన ఇద్దరి మరణవార్త తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధరణేశ్వర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాల తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.