ఈ మద్య సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబంలోనే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఓ యువ బాక్సర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన పంజాబ్‌లోని బటిండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
పంజాబ్ కు చెందిన కుల్దీప్ సింగ్(22) నేషనల్ లెవెల్ బాక్సర్. ఈ యువ బాక్సర్ రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. మొత్తంగా ఐదు పతకాలను గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రీడా రంగంపై అభిమానం పెంచుకున్న కుల్దీప్ బాక్సింగ్ లో గొప్ప ఛాంపియన్ కావాలన్నదే అతడి ఆశయం. ఆ మేరకు చిన్ననాటి నుంచి సాధన చేశాడు… పతకాలు, పేరూ సాధించాడు. జూనియర్ స్థాయిలో స్వర్ణం సాధించిన కుల్దీప్ సింగ్.. ఆ తర్వాత సీనియర్ గానూ రాణించాలని దృష్టి సారించాడు.
తనకు ఏదో పని ఉందని చెప్పి బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుల్దీప్.. గురువారం ఉదయం గ్రామ శివారులోని పంట పొలాల్లో విగతజీవిగా పడిఉండటం చూసిన స్థానికులు వెంటనే వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వాళ్లు అక్కడికి హుటాహుటిన పరుగెత్తుకెళ్లారు. మృతదేహం పక్కన హెరాయిన్‌తో పాటు మరికొన్ని డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
ఇదిలా ఉంటే.. కుల్దీప్ అధిక మోతాదులో డ్రగ్స్ సేవించడం వల్లే మరణించి ఉంటాడని పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చారు. కానీ.. అతడి కుటుంబసభ్యులు, కోచ్ మాత్రం.. కుల్దీప్ సింగ్ డ్రగ్స్ కు బానిస కాదని వాపోతున్నారు. ఏదేమైనా ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ విషయంపై మీ అభిప్రాకాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A five-time medal winner and national-level boxer died, allegedly due to drug overdose, at Talwandi Sabo in this district on Thursday.
Kuldeep Singh, aka Deep Dhaliwal, 22, had won five medals including two gold. #DRUGS #Punjab #Udta #Punjab pic.twitter.com/F6DCpq10dT
— Ankush Saini अंकुश सैनी ਅੰਕੁਸ਼ ਸੈਣੀ انکوش سائیں (@ank1saini) July 28, 2022
ఇది చదవండి: కుప్ప కూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి