కనిపెంచిన కూతురుని ఏ తండ్రి అయినా చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. ఏది అడిగితే అది కాదనకుండా కొనిస్తూ తల్లిని తన కూతురిలో చూసుకుని మురిసిపోతుంటాడు. ఇక కూతురు పెరిగి పెద్దదైతే మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేయాలని ఎన్నోన్నో ఆశలతో ఉండాడు. ఇలా కన్న కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి మాత్రం ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. నిద్రలో ఉన్న మైనర్ కూతురిపై ఆ దుర్మార్గమైన తండ్రి అత్యాచారం చేసి ఆపై ఏం తెలియనట్లుగా నటించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానింకగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ముంబైలోని చెంబూరు ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. ఆ కూతురు పెరిగి పెద్దదై చదువుకుంటోంది. ఇదిలా ఉంటే తండ్రి మాత్రం తాగుడుకు బానిసై కిరాతకుడిగా మారిపోయాడు. అయితే ఇటీవల ఇంట్లో తన కూతురు జోరు నిద్రలో ఉంది. ఇదే సమయంలో తండ్రి ఇంట్లోకి వెళ్లాడు. కన్నకూతురు అన్న కనికరం మరిచిన ఆ తండ్రి కూతురిపై కామంతో రగిలిపోయాడు.
ఇంతటితో ఆగక.. కూతురుని తండ్రి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో కూతురు వెంటనే ఇంట్లో నుంచి తప్పించుకుని ఏడుస్తూ బయటకు వచ్చింది. ఇక ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండడంతో స్థానికులు గమనించి ఏం జరిగిందని ప్రశ్నించగా.. నా తండ్రి నా పై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కోపంతో ఊగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితడును అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.