దేశంలోని ఆడపిల్లలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి దారుణాలపై ప్రభుత్వాలు కఠిన చట్టాలు రూపొందించినప్పటికీ ఎటువంటి మార్పు రావడం లేదు. అయితే అమ్మాయిలపై రాను రాను వావివరసలు లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా సొంతకూతుళ్లపైనే కొందరు దుర్మార్గపు తండ్రులు విచ్చలవిడిగా రెచ్చిపోతూ అత్యాచారాలకు తెగబడుతున్నారు. గతేడాది ముంబైలో జరిగిన ఇలాంటి ఘటనలోనే తండ్రికి న్యాయస్థానం శిక్షను విధించింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన భార్య పిల్లలు, తన తల్లితో కలిసి జీవించాడు. అతను తాగుడుకు బానిసై ప్రతి రోజు ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో.. అతని వేధింపులు తాళలేక భార్య ఇల్లు విడిచి దూరంగా వెళ్లిపోయింది. అయితే తల్లి.. తన పెన్షన్ తో మనవరాలిని, మనవలను చూసుకునేది. కొడుకు ప్రతి రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. అలా రోజులు గడుస్తున్న క్రమంలో ఆ దుర్మార్గపు తండ్రి కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైన చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేసి కొన్ని నెలలుగా ఇదే దారుణానికి పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: విర్రవీగిన 60 ఏళ్ల వృద్ధుడు.. ఒంటరిగా ఉన్న బాలుడిని ఏం చేశాడో తెలుసా?
అయితే మనవరాలి ప్రవర్తినలో మార్పును గమనించిన ముసలవ్వ మనవరాలిని వైద్యుని వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించింది. వైద్యులు మనవరాలిపై అత్యాచారం జరిగిందని గర్భవతి అయిందంటూ కూడా తెలిపారు. దీంతో షాక్ గురైన తల్లి ఇది కొడుకు పనేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా నేరం రుజువు కావడంతో నిందితుడికి కోర్టు 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.