Most Wanted Man: ల్యాండ్ ఫోన్లు వచ్చిన కొత్తలో సరదా కోసం కొంతమంది ఇష్టం వచ్చిన నెంబర్లకు ఫోన్ చేసేవారు. అవతలి వారితో కబుర్లు చెప్పటమో.. తిక్కతిక్కగా మాట్లాడి ఫోన్ కట్ చేయటమో చేసేవారు. రోజులు మారాయి. ల్యాండ్ ఫోన్ల స్థానంలో సెల్‌ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటివి చేసేవారు లేకపోలేరు. అయితే, శృతి మించితే మాత్రం పోలీస్ కేసు తప్పదన్న భయంతో చాలా మంది ఆగిపోతుంటారు. కానీ, కొంతమంది మాత్రం తమ సైకో ఇజాన్ని బయటపెడుతుంటారు. జనాల్ని వేధిస్తుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫ్రష్టేషన్‌లో దాదాపు 113 మంది మహిళలకు ఫోన్ చేసి వేధించాడు. దీంతో 36 జిల్లాల్లో అతడిపై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, కౌశాంభి జిల్లా, సైనీ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రవేంద్ర కుమార్ మౌర్యకు పెళ్లి కాని నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళలంటే పగ పెంచుకున్నాడు. ఆ ఫ్రస్టేషన్‌లో గత కొద్ది నెలల నుంచి ఫోన్‌లో ఇష్టం వచ్చిన నెంబర్లు నొక్కి కాల్స్ చేస్తున్నాడు.
మహిళలు కాల్ లిఫ్ట్ చేస్తే వారితో అసభ్యంగా మాట్లాడుతున్నాడు. వీడియో కాల్స్ చేసి కూడా ఇబ్బంది పెట్టసాగాడు. పోలీసులకు దొరకకుండా ప్రతీ రోజు సిమ్ మారుస్తూ వస్తున్నాడు. ఇలా 113 మంది మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడు. 36 జిల్లాల్లో కలిపి ఇతడిపై మొత్తం 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 1090 టీం రవేంద్రను పట్టుకోవటానికి రంగంలోకి దిగింది. సిమ్ కార్డు లోకేషన్ ఆధారంగా అతడు సైనీ గ్రామంలో ఉన్నట్లు గుర్తించింది. గ్రామం బయట ఉన్న పొలంనుంచి అతడ్ని అదుపులోకి తీసుకుంది. మరి, మోస్ట్ వాంటెడ్ మగాడు రవేంద్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nizamabad: భర్త పొలం నుంచి తిరిగి వచ్చే సరికి ప్రియుడి ఒడిలో భార్య!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.