ప్రేమ గుడ్డిది అని అంటూ ఉంటారు. అయితే చాలా మంది ఈ వాక్యాన్ని పాజిటివ్ సెన్స్ లో వాడుతూ ఉంటారు. అయితే తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలను చూస్తే.. దానిని నెగిటివ్ సెన్స్ లోనే ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ప్రేమ అనే పేరుతో ఎంతో మంది మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు డబ్బుకోసం ప్రేమను వాడుకుంటుంటే.. ఇంకొందరు ఏకంగా ప్రేమను అడ్డుపెట్టుకుని ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా ఢిల్లీలో వెలుగుచూసిన శ్రద్ధా వాకర్ కథే అందుకు నిదర్శనం. ప్రేమించిన వాడు వేధింపులకు గురి చేస్తున్నా కూడా గుడ్డిగా అతడినే నమ్మి ఆమె ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఇప్పుడు పెరూలో అచ్చు అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఈ కేసులో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఆమె అవయవాలను అమ్ముకున్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. జువాన్ పాబ్లో అనే 37 ఏళ్ల వ్యక్తి పెరూలో బీచ్‌లో నివాసం ఉంటూ ఉన్నాడు. అతనికి ఆన్‌లైన్‌లో మెక్సికోకు చెందిన బ్లాంకా అరెల్లానో(51) పరిచయం అయ్యింది. కొన్నాళ్లు వాళ్లు ఆన్‌లైన్‌లోనే ప్రేమించుకున్నారు. అయితే చివరికి జువాన్‌ను వ్యక్తిగతంగా కలవాలి అని అరెల్లానో కోరుకుంది. అనుకున్నదే తడవుగా మెక్సికో నుంచి పెరూకి బయల్దేరింది. దాదాపుగా 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి అతడిని కలుసుకోవాలని ఉవిళ్లూరుతూ వచ్చింది. చివరికి తన ప్రేమికుడు జువాన్‌ను కలుసుకుంది. ఇద్దరూ కలిసి దాదాపు వారంపాటు పెరూ కలియదిరిగారు. బ్లాంకా అరెల్లో మధ్య మధ్యలో తన కుటుంబంతో మాట్లాడుతూనే ఉంది.
అయితే నవంబర్ 7న ఆఖరిగా ఆమె తన కుటుంబంతో మాట్లాడింది. అంతా బాగానే ఉంది. నాకు జువాన్‌కు మధ్య బంధం చాలా బాగుంది అని కూడా ఆమె తెలిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే నవంబర్ 7 తర్వాత వారికి ఆమె నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. నవబంర్ 9న బీచ్‌లో బ్లాంకా అరెల్లో మృతదేహం తేలియాడుతూ కనిపించింది. అది చూసిన మత్స్యాకారుడు పోలీసులకు సమాచారం అందించాడు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఈ జువాన్ గురించి తెలిసింది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అవయవాల కోసం బ్లాంకా అరెల్లోని హత్య చేసినట్లు జువాన్ అంగీకరించాడు. ప్రేమ అనుకుని మెక్సికో నుంచి పెరూ వరకు వచ్చి ఆమె ప్రాణాలను కోల్పోయింది. ఈ ఘటన గురించి తెలుసుకుని స్థానికులు, సోషల్ మీడియాలో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
Jamás creí estar en esta situación, hoy pido apoyo y difusión para localizar a una de las personas más amadas e importantes de mi vida. Mi tía Blanca Olivia Arellano Gutiérrez desapareció el día Lunes 07 de Noviembre en Peru, ella de origen Mexicano, tememos por su vida+ pic.twitter.com/4aHRuv0zAW
— Karla Arellano (@itskararellano) November 12, 2022