ఈ రోజుల్లో కొందరు పెళ్లైన మహిళలు భర్తను పక్కనే పెట్టి మరో మగాడితో ఎంచక్కా రొమాన్స్ కు తెర లేపుతున్నారు. ఇలా భర్తను కాదని కొందరు మహిళలు పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. క్షణిక సుఖం ఆరాటపడుతూ చివరికి ప్రియుడి కోసం భర్తనే అంతమొందిస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ భార్య భర్తను కాదని ప్రియుడితో సరసాలకు దిగింది. ఓ రోజు రాత్రి భార్య ప్రియుడితో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మేడ్చల్ మండలంలోని అక్భర్జాపేటలోని లక్ష్మి, కృష్ణ దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ ఉంది. అయితే 2014లో అదే గ్రామానికి చెందిన బాల్ రాజ్ అనే వ్యక్తి వద్ద కృష్ణ ఆటోను కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి బాల్ రాజ్ కృష్ణ ఇంటికి అప్పుడప్పుడు రావడంతో అతని భార్య అయిన లక్ష్మితో పరిచయం పెంచుకున్నాడు. వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా క్షణిక సుఖం కోసం ఆరాటపడ్డ లక్ష్మి.. భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉంది. అలా కొన్నాళ్ల పాటు లక్ష్మి తన చీకటి కాపురాన్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే కొన్నాళ్లకి భార్య సాగిస్తున్న వివాహేతర సంబంధం భర్త కృష్ణకు తెలిసింది.
దీంతో పద్దతి మార్చుకోవాలని భర్త అనేక సార్లు భార్యకు చెప్పి చూశాడు. అయినా లక్ష్మి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇదిలా ఉంటే.. 2020 ఏప్రిల్ 8న రోజు రాత్రి భర్త జోరుగా నిద్రమత్తులోకి జారుకున్నాడు. లక్ష్మి వెంటనే ప్రియుడు బాల్ రాజ్ కు ఫోన్ చేసి మరీ తన ఇంటికి రప్పించుకుంది. అనంతరం పక్క రూమ్ లోనే భార్య ప్రియుడితో బరితెగించి ఎంజాయ్ చేస్తుంది. ఏదో శబ్దం వినిపించడంతో భర్త కృష్ణ లేచి చూడగా.. భార్య బాల్ రాజ్ తో నగ్నంగా కనిపించింది. ఈ సీన్ ను చూసి భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
దీంతో అలెర్ట్ అయిన బాల్ రాజ్, లక్ష్మి కృష్ణ మెడకు తీగలను బిగించి దారుణంగా హత్య చేశారు. నా భర్త కరోనా సమయంలో మద్యం, కళ్లు దొరకకపోవడం కారణంగా మనస్థాపంతో మరణించాడని భార్య లక్ష్మి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో అందరూ నిజమనే నమ్మారు. అయతే కొన్ని రోజులు గడిచాక ఈ ఘటనపై అనుమానమొచ్చిన కృష్ణ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.