ప్రేమిస్తున్నానని చెప్పులు అరిగేలా తిరిగాడు. నువ్వంటే ప్రాణం, నువ్వు లేకుండా నేను లేనంటూ ఎన్నో సినిమా డైలాగ్ లు కొట్టాడు. చివరికి మనోడి మామ మాటలకు బలైన యువతి అతని ప్రేమలో పడిపోయింది. ఇక కొన్నాళ్ల తర్వాత ఇద్దరు సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగాడు. ఇక ఇంతటితో ఆగాడా అంటే అదీ లేదు. ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారరీక కోరికలు తీర్చుకున్న ప్రియుడు చివరికి ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ షాక్ నుంచి కోలుకోలేని ప్రియురాలి సంచనల నిర్ణయం తీసుకుంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నెన్నెల తండాకు చెందిన దారవత్ రాజ్ కుమార్, బెల్లంపల్లి షంషీర్ నగర్ కు చెందిన తేజ శ్రీ (22) ఇద్దరు గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు.
అలా వీరి ప్రేమాయణం నెలల నుంచి ఏళ్లు గడిచింది. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు రాజ్ కుమార్ ప్రియురాలితో కోరికలు అన్నీ తీర్చుకున్నాడు. అయితే ఇటీవల తేజశ్రీ మరోసారి పెళ్లి మాట ఎత్తేసరికి ప్రియుడు రాజ్ కుమార్ ముఖం చాటేసి పెళ్లి చేసుకోనంటూ తేల్చి చెప్పాడు. ప్రియుడి మాటల విన్న తేజశ్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇక మోసపోయానని గ్రహించిన తేజశ్రీ తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ దారుణాన్ని తట్టుకోలేని ప్రియురాలు ప్రియుడు, అతని కుటుంబ సభ్యులు మోసం చేశారంటూ సూసైడ్ నోట్ రాసి బుధవారం పురుగుల మందు తాగి నెన్నెల పీహెచ్ సీ ఆవరణలో పడిపోయింది.
గమనించిన ఆస్పత్రి సిబ్బంది ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ తేజ శ్రీ గురువారం ప్రాణాలు విడిచింది. తేజ శ్రీ మరణించడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కూతురి మరణానికి కారణమైన ప్రియుడు, అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజశ్రీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.