మనిషికి ఉండేది ఒకే ఒక్క జీవితం ఇది. ఈ జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉండాలని కోరుకుంటే మాత్రం పొరపాటే. జీవితం అన్నాక సంతోషాలు, బాధలతో పాటు మరెన్నో సమస్యలు వస్తు ఉంటాయి, పోతు ఉంటాయి. ఇక వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కుని ముందడుగు వేసిన వాడే అసలైన మనిషిగా జీవించినట్టు లెక్క. కానీ కొంతమంది మాత్రం చిన్న చిన్న చిన్న సమస్యలకే మనస్థాపం చెంది సమస్యకు పరిష్కార మార్గం లేదని చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ నిండు ప్రాణాన్ని తీసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఆలోచించిన ఓ యువతి ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఆ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే పూర్తి సమాచారం మీ కోసం.
అది మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం దొనబండ. ఇదే గ్రామంలో సత్తయ్య, రచన దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొంత కాలానికి వీరికి హారిక (19) అనే కూతురు జన్మించింది. ఈ యువతి స్థానికంగా ఓ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. అంతా బాగానే ఉందనుకున్న క్రమంలోనే హారికకు గత మూడేళ్ల నుంచి ఏదో తెలియని రోగంతో బాధపడుతుంది. కూతురు తల్లడిల్లుతుంటే చూడలేని తల్లిదండ్రులు అనేక ఆస్పత్రుల్లో లక్షలు పోసి చూపించారు. అలా కొన్ని రోజులు గడిచింది. రోగం కూడా నయం అయిందని కూతురుతో పాటు తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే తగ్గింది అనుకున్న ఆ రోగం మళ్లీ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు మరోసారి కూతురిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
అయినా ఆ రోగం మాత్రం తగ్గలేదు. దీంతో ఆ యువతి తెలియని రోగంతో గత మూడేళ్లుగా నరకాన్ని చూసింది. ఈ క్రమంలోనే ఆ యువతి తట్టుకోలేకపోతున్నా.. ఇలాంటి బతుకు నాకొద్దని, ఆత్మహత్యే పరిష్కార మార్గమని అనుకుంది. ఇక ఇందులో భాగంగానే హరిక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గమనించిన హారిక కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు సమాచారం అందించి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో హారిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జీవితంపై విరక్తితో నిండు ప్రాణాలు తీసుకున్న హారిక ఘటన స్థానికులను కన్నీరు తెప్పిస్తుంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.